ANR NationalAward : మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం.. అమితాబ్ బ‌చ్చ‌న్ చేతుల మీదుగా..

మెగాస్టార్ చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

ANR NationalAward : మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం.. అమితాబ్ బ‌చ్చ‌న్ చేతుల మీదుగా..

Amitabh Bachchan Present ANR NationalAward to Chiranjeevi

Updated On : October 28, 2024 / 7:27 PM IST

ANR NationalAward : మెగాస్టార్ చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ చేతుల మీదుగా ఈ అవార్డును చిరు అందుకున్నారు.

లెజెండ‌రీ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు ఇవ్వ‌నున్న‌ట్లు అక్కినేని కుటుంబం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో నేడు (అక్టోబ‌ర్ 28 సోమ‌వారం) హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ అవార్డు ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Nayanthara : కాస్మోటిక్ స‌ర్జ‌రీ చేయించుకున్న న‌య‌న‌తార..? లేడీ సూప‌ర్ స్టార్ చెప్పిన నిజం ఇదే..

చిరంజీవి తల్లి అంజనాదేవి, ద‌ర్శ‌కులు రాఘవేందర్ రావు, నిర్మాత అశ్వినీదత్, నిర్మాత అల్లు అరవింద్, హీరోలు వెంకటేశ్, రామ్ చరణ్, నాని, రమ్యకృష్ణ, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

అక్కినేని జాతీయ పురస్కారాన్ని గతంలో దేవానంద్, షబానా అజ్మీ, అంజలీ దేవి, వైజయంతిమాల బాలి, లతా మంగేష్కర్, కె. బాలచందర్, హేమమాలిని, శ్యామ్ బెనెగల్, అమితాబ్ బచ్చన్, ఎస్.ఎస్.రాజమౌళి, శ్రీదేవి, రేఖ లు అందుకున్నారు.

Unstoppable with NBK S4 : అన్‌స్టాప‌బుల్ సెకండ్ ఎపిసోడ్‌.. మ‌ల‌యాళం స్టార్ హీరోతో!