వామ్మో వర్మ : అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు – రివ్యూ

రామ్ గోెపాల్ వర్మ - అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు - రివ్యూ

  • Published By: sekhar ,Published On : December 12, 2019 / 12:22 PM IST
వామ్మో వర్మ : అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు – రివ్యూ

Updated On : December 12, 2019 / 12:22 PM IST

రామ్ గోెపాల్ వర్మ – అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు – రివ్యూ

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ పట్టు పట్టాడంటే ఓ పట్టాన వదలడు. ఏ ముహూర్తాన ఏపీ రాజకీయాలపై సినిమా మొదలు పెట్టాడో కానీ.. సినిమా టైటిల్ దగ్గరినుంచి వివాదాల మీద వివాదాలు.. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. డిసెంబర్ 12న విడుదల కావలసిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రానికి చివరి నిమిషంలో సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో రిలీజ్‌కి లైన్ క్లియర్ అయింది.

Image

ఆర్జీవీ ఏ పనిచేసినా అందులో తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. ఈ సినిమా విషయంలో కూడా అదే చేశాడు. తను తీస్తున్న సినిమా సిచ్యువేషన్ ఏంటో అందరికీ తెలుసు.. ఆ సినిమాకు తగ్గట్టు రియలిస్టిక్ క్యారెక్టర్స్‌ను వెతికిమరీ తీసుకొచ్చాడు.. మరి వారు ఎలా నటించారు.. అంచనాలను అందుకోగలిగారా లేదా.. వర్మ ఈ సినిమాను ఎలా డ్రైవ్ చేశాడు.. సినిమా కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్ ఏంటి. మిగతా టెక్నీషియన్స్ గురించి ఓ లుక్కేద్దాం.. 

Image
కథ విషయానికొస్తే :
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 2019  అసెంబ్లీ ఎన్నికల్లో వెలుగుదేశం పార్టీ (వీడీపీ)పై ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుంది. 151 సీట్లతో జగన్నాథ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అధికారాన్ని కోల్పోయిన వీడీపీ పార్టీ అధినేత బాబు, ఆయన తనయుడు చినబాబు, పార్టీ నేతలు ఓటమిని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తుంటారు. మరోవైపు సీఎం జగన్నాథ రెడ్డికి ప్రజాదరణ పెరిగిపోతూ ఉంటుంది.

Read Also : మామాంగం – రివ్యూ

ఈ నేపథ్యంలో బాబుకు అత్యంత ఆప్తుడు అయిన దయనేని రమా ప్రభుత్వంపై, సీఎంపై తీవ్ర ఆరోపణలు చేస్తారు. జగన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టేలా ఆధారాలు సృష్టిస్తూ ఉంటారు. ఈ క్రమంలో బెజవాడ బెంజ్ సర్కిల్‌లో ప్రజలంతా చూస్తుండగానే దయనేని రమాను కొంత మంది దారుణంగా హత్య చేస్తారు. అసలు ఈ హత్య ఎవరు చేశారు? ఈ హత్య వెనుక సీఎం హస్తం ఉందా? లేకపోతే ప్రతిపక్షమే ఈ హత్య చేయించిందా? అనేదే కథ.

నటీనటుల విషయానికొస్తే :
సినిమాలోని ప్రతి పాత్రను చాలా ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు. ప్రతి పాత్రలోనూ ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న ప్రముఖుల పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. అంతమంది ఆర్టిస్టులను వెతికి పట్టుకోవడం వర్మకే సాధ్యం. అయితే, నటీనటులకి చెప్పించిన డబ్బింగ్ మాత్రం కాస్త ఇబ్బంది పెడుతుంది. చిన్న పాత్రలకు చెప్పిన డబ్బింగ్ చాలా బాగా కుదిరింది కానీ.. ప్రధాన పాత్రలకు చెప్పిన డబ్బింగే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.

మనసేన పార్టీ అధినేత ప్రణయ్ కళ్యాణ్ పాత్రను మాత్రం కేవలం సెటైర్ వేయడానికి మాత్రమే పెట్టినట్టు ఉంది. కథలో ఆయన్ని పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు. అప్పుడప్పుడు కనిపిస్తూ రెండు మూడు డైలాగులు చెప్పి వెళ్లిపోయారు. బ్రహ్మానందం పాత్రకైతే ఒకే ఒక్క డైలాగ్ ఇచ్చారు. అది కూడా సినిమా ఆఖర్లో. స్పీకర్ పమ్మినేనిగా ఆలీ అదరగొట్టారు. పీపీ జాల్ పాత్రలో రాము తన విశ్వరూపం చూపించాడు. ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో బాగా కుదిరింది. ధన్‌రాజ్, కత్తి మహేష్, స్వప్న (10TV) తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే : 
ఇంటర్వెల్ దగ్గర క్రియేట్ చేసిన ఆసక్తిని దర్శకుడు సెకండాఫ్‌లో కొనసాగించలేకపోయారు. తెలిసిన కథను బాగానే తెరకెక్కించారు కానీ.. కల్పిత కథను సరిగా అల్లలేకపోయారు. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు బాగా బోర్ కొట్టిస్తాయి. కెమెరా యాంగిల్స్ అన్నీ వర్మ ఆలోచనల్లానే గజిబిజీగా ఉన్నాయి. పాటలు, ఆర్ఆర్ సోసో గా ఉన్నాయి. 

ఓవరాల్‌గా చెప్పాలంటే :

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకుని అధికార పక్షాన్ని హైలెట్ చేస్తూ.. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది చెప్పడం కష్టం.