Rewind : షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా.. అమృత చౌదరి ‘రివైండ్’ సినిమా ట్రైలర్ చూశారా?

రివైండ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అమృత చౌదరి.

Rewind : షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా.. అమృత చౌదరి ‘రివైండ్’ సినిమా ట్రైలర్ చూశారా?

Amrutha Chowdary First Movie as Heroine Rewind Trailer Released

Updated On : October 6, 2024 / 3:17 PM IST

Rewind Trailer : పలు షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో మెప్పించిన అమృత చౌదరి ఇటీవల సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు హీరోయిన్ గా మారింది. రివైండ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అమృత చౌదరి.

Also Read : Viswam Trailer : గోపీచంద్ ‘విశ్వం’ ట్రైలర్ వచ్చేసింది.. కామెడీతో పాటు యాక్షన్ కూడా..

సాయి రోనక్, అమృత చౌదరి జంటగా క్రాస్ వైర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా, దర్శకుడిగా ఈ రివైండ్ సినిమా తెరకెక్కిస్తున్నారు. జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే ఒక రేడియోలో సంవత్సరం మారిస్తే కాలంలో వెనక్కి వెళ్తారు. లవ్, సస్పెన్స్, టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. మీరు కూడా రివైండ్ ట్రైలర్ చూసేయండి.

ఇక ఈ రివైండ్ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అమృత చౌదరి మాట్లాడుతూ.. హీరోయిన్ గా నాకు ఇదే మొదటి సినిమా. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది అని తెలిపింది. మరి ఈ సినిమాతో సినీ పరిశ్రమలో మరో తెలుగు హీరోయిన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.