Pushpa Movie : వాడకం అంటే అమూల్‌దే..

అమూల్ బ్రాండ్ తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ‘పుష్ప’ రాజ్, శ్రీవల్లీ క్యారెక్టర్లను వాడేసుకుంది..

Pushpa Movie : వాడకం అంటే అమూల్‌దే..

Amul Pushpa

Updated On : January 16, 2022 / 5:40 PM IST

కవితకనర్హం అన్నట్టు.. పబ్లిసిటీకి సినిమా అయినా, సాఫ్ట్ డ్రింక్ పర్లేదు.. మన బ్రాండ్ నేమ్ జనాల్లోకి వెళ్లిందా, లేదా అన్నట్టుంది అమూల్ బ్రాండ్ వ్యవహారం. ఇటీవల కోక్ ఇష్యూను తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడుకున్న అమూల్ ఇప్పుడు ఏకంగా ఓ టాలీవుడ్ సినిమాలోని లీడ్ క్యారెక్టర్లని తమ బ్రాండ్ కోసం వాడేసుకుంది.

Unstoppable : మద్యం మీద పద్యం.. బాలయ్య మామూలోడు కాదయ్యో!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ల కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘పుష్ప – ది రైజ్’.ఈ సినిమాతో అల్లు అర్జున్‌కి నార్త్‌లో బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. అందుకే ఇప్పుడు అమూల్ తన బ్రాండ్ కోసం పుష్ప రాజ్, శ్రీవల్లి క్యారెక్టర్లను వాడేసుకుంది.

Allu Arjun : ‘‘సౌత్ కా సుల్తాన్’’.. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..

‘పుష్పక్ ది స్లైస్.. అమూల్ హ్యావ్ సమ్ అమ్ములు, అర్జున్’ అంటూ పుష్ప రాజ్, శ్రీవల్లి క్యారెక్టర్లతో డిజైన్ చేసిన కార్టూన్ ఫొటోను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. అమూల్ ఐడియా అదిరింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Amul – The Taste of India (@amul_india)