Bharateeyudu 2 : భారతీయుడు-2కి అనంత్ అంబానీ షాక్..?
విశ్వనటుడు కమల్‌హాసన్ నటించిన భారతీయుడు 2 ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Anant Ambani shock for Indian-2 movie
విశ్వనటుడు కమల్‌హాసన్ నటించిన భారతీయుడు 2 ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కమల్ హాసన్-డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన చిత్రం భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా భారతీయుడు-2 చిత్రీకరించిన విషయం తెలిసిందే. సుమారు నాలుగేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. అన్నింటిని దాటుకుని రిలీజ్‌కు సిద్ధమైన భారతీయుడు-2కి ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఎదురైందని ఇండస్ట్రీ టాక్.
భారతీయుడు-2 ఈ నెల 12న రిలీజ్ కానుండగా, అదే సమయంలో దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహాం జరగనుంది. దీంతో ఈ నెల 12 నుంచి 14వ తేదీవరకు ముంబైలోని అన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్స్‌ను ముందుగా బుక్ చేసేసింది అంబానీ కుటుంబం. తన కుటుంబ సన్నిహితులు, తమ కంపెనీ ఉద్యోగులు, శ్రేయోభిలాషులు అందరూ అనంత్ వివాహ వేడుకలను చూడాలనే ఉద్దేశంతో మూడు రోజులపాటు ముంబైలో మల్టీప్లెక్స్‌లను బుక్ చేయడంతోపాటు ఒకటి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను వాడుకోవాలని చూస్తోందట అంబానీ ఫ్యామిలీ.
Manchu Vishnu : యూట్యూబర్స్‌కు మంచు విష్ణు వార్నింగ్.. 48 గంటల డెడ్‌లైన్..!
దీంతో భారతీయుడు-2కి మూడు రోజుల పాటు ముంబైలో స్క్రీన్స్ దొరకడం కష్టమే అంటున్నారు. అదేసమయంలో ఓటీటీలో ఎక్కువగా అంబానీ మ్యారేజ్ ఈవెంట్‌ను చూసే అవకాశం ఉండటంతో.. ఆ ప్లాట్‌ఫామ్‌లోనూ భారతీయుడు-2కి ఇబ్బంది తప్పదని టాక్ వినిపిస్తోంది.
ఎన్నో కష్టాలను దాటుకుని సినిమా రిలీజ్ వరకు తీసుకువస్తే.. ఇప్పుడు ఈ కొత్త సమస్య చిత్ర బృందాన్ని నిరుత్సాహానికి గురిచేస్తోందంటున్నారు. భారతీయుడు సినిమాపై ఎంత మోజు ఉంటుందో అంతకు రెట్టింపులో అనంత్ అంబానీ వివాహంపై ఎక్కువ క్రేజ్ కనిపిస్తుండటంతో కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి భారతీయుడికి అనంత్ అంబానీ షాకిచ్చినట్లేనని ఇండస్ర్టీ టాక్.
Thangalaan Trailer : ‘తంగలాన్’ ట్రైలర్ వచ్చేసింది.. విక్రమ్ నటన నెక్ట్స్ లెవల్..