Anasuya : అప్పుడు రంగమ్మత్త.. ఇప్పుడు అక్కమ్మ.. మీరు నన్ను అభినందిస్తున్నారో..ట్రోల్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు..

తాజాగా పెదకాపు 1 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇందులో అనసూయ మాట్లాడుతూ తన పాత్ర గురించి తెలిపింది.

Anasuya : అప్పుడు రంగమ్మత్త.. ఇప్పుడు అక్కమ్మ.. మీరు నన్ను అభినందిస్తున్నారో..ట్రోల్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు..

Anasuya comments in Peddha Kapu 1 Pre Release Event goes viral

Updated On : September 24, 2023 / 11:18 AM IST

Anasuya Comments : డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) దర్శకత్వంలో కొత్త హీరో విరాట్ కర్ణతో పెదకాపు 1(Peddha Kapu 1) అనే సినిమా రాబోతుంది. ఊర్లో జరిగే కులం గొడవల నేపథ్యంలో ఈ సినిమా రా అండ్ రస్టిక్ గా తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇందులో అనసూయ ఓ ముఖ్య పాత్రలో పోషిస్తుంది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల విలన్ పాత్రలో నటించడం విశేషం.

అనసూయ ప్రస్తుతం టీవీ షోలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి వరుస సినిమాలతో బిజీగా ఉంది. రంగస్థలంలో రంగమ్మత్తగా మెప్పించిన తర్వాత ఇంకా బిజీ అయింది. పుష్పలో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు పెదకాపు 1 సినిమాలో అక్కమ్మ పాత్రలో కనిపించబోతుంది. తాజాగా పెదకాపు 1 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇందులో అనసూయ మాట్లాడుతూ తన పాత్ర గురించి తెలిపింది.

అయితే అనసూయ మైక్ తీసుకోగానే ఆడియన్స్ బాగా అరిచారు. విజిల్స్ తో గోల చేశారు. దీంతో అనసూయ.. మీరు ఇలా అరుస్తుంటే నన్ను అభినందిస్తూ ఓ ఏసుకుంటున్నారో, ట్రోల్ చేస్తూ ఏసుకుంటున్నారో నాకు అర్ధం కావట్లేదు అని అంది. అనసూయ ఏం మాట్లాడినా, ట్వీట్ చేసినా వైరల్ అయ్యేలా ఉంటుంది. ఎప్పుడూ తన మాటలతో వార్తల్లో నిలుస్తుంది. నెటిజన్లు కూడా బాగా ట్రోల్ చేస్తారు. దీంతో ఈవెంట్ లో ఆడియన్స్ అరిస్తే ఇలాంటి కామెంట్స్ చేయడంతో మరోసారి వైరల్ గా మారింది.

Also Read : Kushi : ఓటీటీలోకి వచ్చేస్తున్న ఖుషి.. ఎప్పుడు? ఎక్కడ?

అలాగే సినిమాలో తన పాత్ర గురించి చెప్తూ..ఈ సినిమాలో భాగం అయినందుకు నాకొక గౌరవం ఏర్పడుతుందని నమ్ముతున్నాను. సినిమా చూసిన తర్వాత మీరు కూడా అదే అనుకుంటారు. ఈ సినిమాలో నటించడం అదృష్టం. నాకు ఈ అక్కమ్మ అవకాశం ఇచ్చినందుకు శ్రీకాంత్ అడ్డాల గారికి చాలా థ్యాంక్స్. రంగమ్మత్త పాత్రని ప్రేక్షకులు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో పెదకాపు 1 సినిమా తర్వాత అక్కమ్మ పాత్రని కూడా అలాగే రిసీవ్ చేసుకొని పిలుస్తారు ప్రేక్షకులు. ఈ విషయంలో నాకు బాగా నమ్మకం ఉంది అని తెలిపింది.