Anasuya : వాళ్ళు వింత జీవులు.. వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది.. అనసూయ వ్యాఖ్యలు..
తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులు, నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

Anasuya Sensational Comments on Trollers goes viral
Anasuya : యాంకర్ గా మంచి పేరు తెచ్చుకొని పాపులర్ అయిన అనసూయ ఆ తర్వాత నటిగా కూడా బిజీ అయింది. చాలా సినిమాల్లో ముఖ్య పాత్రలు, కొన్ని సినిమాల్లో మెయిన్ లీడ్స్ చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో నటిగా ఫుల్ బిజీగా ఉండటంతో టీవీకి కూడా దూరమైంది. ఇక అనసూయ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన ఫోటోలని, ఫ్యామిలీ గురించి షేర్ చేస్తూనే మరో వైపు తనని కామెంట్ చేసే వాళ్లపై గట్టిగానే రియాక్ట్ అవుతుంది.
గత కొన్నాళ్ళు అనసూయ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తనపై వచ్చే ట్రోల్స్ కి రియాక్ట్ అవ్వడమే కాకుండా, అక్కర్లేని విషయాల్లో కామెంట్స్ చేస్తూ కూడా వైరల్ అయింది అనసూయ. ఇక తనని ట్రోల్ చేసే వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని హడావిడి చేసింది. విజయ్ దేవరకొండ ఇష్యూతో కూడా కొన్నాళ్ళు ట్రెండ్ లో ఉంది అనసూయ. అయితే ఏమైందో ఏమో కానీ కొన్ని రోజుల క్రితం ఇకపై ఎక్కువ రియాక్ట్ అవ్వను, నాకు మనశాంతి కావాలి అంటూ ఓ ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు చేసింది.
Also Read : Manchu Lakshmi : ముంబైలో మంచు లక్ష్మి కొత్త ఇల్లు చూశారా? పూర్తిగా ముంబైకి మకాం మార్చేసిన లక్ష్మి మంచు..
తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులు, నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఓ నెటిజన్ మీ మీద బ్యాడ్ గా ట్రోల్స్ చేసేవారికి మీరు ఏం చెపుదాం అనుకుంటున్నారు అని అడగగా.. దానికి అనసూయ సమాధానమిస్తూ.. అసలు ట్రోలర్స్ అంటేనే వికారమైన జీవులు. వారికి ఎంత దూరంగా అంటే అంత మంచిది అని తెలుసుకున్నాను. ఆ కంపు నాకు అంటొద్దు కదా. సో వాటికి నేనేం చెప్పి టైం వేస్ట్ చేసుకోను అని అంది. దీంతో డైరెక్ట్ గా మళ్ళీ అనసూయ ట్రోల్స్ చేసేవాళ్లపై కామెంట్స్ చేయడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనికి నెటిజన్లు, ట్రోలర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.