Anchor Anushree: యాంకరమ్మకి మత్తు మరక.. చార్జిషీట్లో అను పేరు

మన తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. మొత్తం సౌత్ సినీ పరిశ్రమ ఇప్పుడు మత్తు చిక్కుల్లో పడింది. కన్నడ నుండి టాలీవుడ్ వరకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు..

Anchor Anushree: యాంకరమ్మకి మత్తు మరక.. చార్జిషీట్లో అను పేరు

Anchor Anushree

Updated On : September 9, 2021 / 3:52 PM IST

Anchor Anushree: మన తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. మొత్తం సౌత్ సినీ పరిశ్రమ ఇప్పుడు మత్తు చిక్కుల్లో పడింది. కన్నడ నుండి టాలీవుడ్ వరకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు ఈ మత్తు దందాలో పేర్కొనడం ఇప్పుడు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కాగా, కన్నడ నాట డ్రగ్స్ కేసులో మంగళూరు సీసీబీ పోలీసులు తాజాగా కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. కాగా, ఈ చార్జిషీట్లో ప్రముఖ అందాల యాంకర్, నటి అనుశ్రీ పేరును పేర్కొన్నారు. దీంతో ఈ యాంకరమ్మ వ్యవహారం ఇప్పుడు మళ్ళీ శాండల్ వుడ్ లో హాట్ గా మారింది.

TMC MP Nusrat Jahan: నా బిడ్డకి తండ్రెవరో ఆ తండ్రికి బాగానే తెలుసు!

గతేడాది సెప్టెంబరులో శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ రాకెట్‌ బయటపడిన సందర్భంలో యాంకర్ అనుశ్రీని కూడా విచారించిన సంగతి తెలిసిందే. కాగా, అప్పుడే అనుశ్రీ డ్రగ్స్‌ను అమ్మడంతో పాటు రూంకు తెచ్చేదని ఆమె స్నేహితుడు కిశోర్‌ అమన్‌ శెట్టి చెప్పినట్లు తెలిపారు. తరుణ్, అనుశ్రీలు డ్రగ్స్‌ పార్టీలకు వెళ్లడంతో పాటు రూంకు తీసుకొచ్చేవారు. అనుశ్రీ బెంగళూరులో డాన్స్ ప్రాక్టీస్ చేసే సమయంలో డ్రగ్స్‌ తీసుకుంటే మరింత ఎనర్జీగా ఉంటుందని తోటివారితో చెప్పేదని తరుణ్ చెప్పినట్లు తెలిసింది. కాగా అనుశ్రీ రియాలిటీ షోలో గెలిచిన సమయంలో తరుణ్‌ డ్రగ్స్‌ పార్టీ కూడా ఇచ్చాడని పేర్కొన్నారు.

Parvati Nair: విరహ చూపులు.. హాట్ పోజులు.. ఆహా అనాల్సిందే!

అయితే, అనుశ్రీ డ్రగ్స్‌ తీసుకున్నట్లు తాను పోలీసు విచారణలో చెప్పలేదని తాజాగా కిశోర్‌ అమన్‌శెట్టి ప్రకటించాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన కిషోర్ 2009లో కుణియోణ బారా కన్నడ డ్యాన్స్‌ షోలో కలిసిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఆమెను కలవలేదన్నారు. ఇక అనుశ్రీ తను ఏ తప్పు చేయలేదంటూ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 14 ఏళ్ల క్రితం బస్సులో బెంగళూరుకుకి వచ్చిన నేను సుమారు 12 ఏళ్ల కాలం పాటు హాస్టల్‌లో ఉన్నానని.. నేను మంచిగా ఉండడం వలనే ఇంత స్థాయికి ఎదిగానని.. డ్రగ్స్‌ కేసులో ఇరికించడం బాధగా ఉందని వీడియోలో పేర్కొంది.