Anchor Lasya: పండగపూట పండంటి బాబుకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య
తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న లాస్య, ఆ తరువాత పలు సినిమాల్లోనూ నటించింది. తన కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు ఆమె పెళ్లి చేసుకుని, చాలా అరుదుగా యాంకరింగ్ చేస్తూ కనిపించింది. ఇక తన ఫ్యామిలీకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ వచ్చిన లాస్య, అవకాశం వచ్చినప్పుడల్లా టీవీల్లో కనిపించింది. గతంలో బిగ్‌బాస్ వంటి పాపులర్ షోలోనూ లాస్య పాల్గొని కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.

Anchor Lasya Gives Birth To Baby Boy
Anchor Lasya: తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న లాస్య, ఆ తరువాత పలు సినిమాల్లోనూ నటించింది. తన కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు ఆమె పెళ్లి చేసుకుని, చాలా అరుదుగా యాంకరింగ్ చేస్తూ కనిపించింది. ఇక తన ఫ్యామిలీకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ వచ్చిన లాస్య, అవకాశం వచ్చినప్పుడల్లా టీవీల్లో కనిపించింది. గతంలో బిగ్‌బాస్ వంటి పాపులర్ షోలోనూ లాస్య పాల్గొని కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.
Anchor Lasya : రెండోసారి తల్లి కాబోతున్న యాంకర్ లాస్య..
ఇక ఇప్పటికే ఓ పాపకు తల్లయిన లాస్య, ఇటీవల రెండోసారి గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల తన సీమంతం వేడుకను ఘనంగా జరుపుకోగా, ఈ వేడుకకు పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు. అయితే తన డెలివరీ టైమ్ దగ్గరపడుతుందని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిన లాస్య, తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. హోలీ రోజున తనకు పండంటి బాబు పుట్టాడని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
Anchor lasya : రెండోసారి తల్లి కాబోతున్న యాంకర్ లాస్య..
ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోతో ఈ గుడ్ న్యూస్‌ను అందరితో పంచుకుంది లాస్య. తమ ఫ్యామిలీలోకి కొత్త వ్యక్తి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని ఆమె ఈ సందర్భంగా సంతోషాన్ని పంచుకుంది. మార్చి 7న తనకు బాబు పుట్టినట్లుగా లాస్య చెప్పుకురావడంతో ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం లాస్య పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
View this post on Instagram