Pradeep – Pawan Kalyan : అత్తారింటికి దారేది షూట్ లో నా ఫస్ట్ డే.. పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా ఉంటే.. ఆయన నన్ను గుర్తుపట్టి..

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు ప్రదీప్.

Pradeep – Pawan Kalyan : అత్తారింటికి దారేది షూట్ లో నా ఫస్ట్ డే.. పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా ఉంటే.. ఆయన నన్ను గుర్తుపట్టి..

Anchor Pawan Kalyan Shares Shooting Experience with Pawan Kalyan in Attarintiki Daredi Movie

Updated On : March 30, 2025 / 10:02 AM IST

Pradeep – Pawan Kalyan : యాంకర్ ప్రదీప్ హీరోగా తన రెండో సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో ఏప్రిల్ 11న రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ చాట్ షోకి వచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో పలువురు హీరోలతో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు.

ప్రదీప్ మాట్లాడుతూ.. జులాయి సినిమా తర్వాత అత్తారింటికి దారేదిలో కూడా ఉంటావు అని త్రివిక్రమ్ సర్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అనడంతో ఫుల్ హ్యాపీ. నాకు సినిమాలో మొదటి రోజు షూట్ పవన్ కళ్యాణ్ – సమంత గారితోనే. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు. నేను వాళ్ళను చూడకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చోవాలి. అసలు ఎదురుగా పవన్ కళ్యాణ్ సర్ ని పెట్టుకొని ఆయన్ని చూడకుండా ఎవరు ఉంటారు. నా వల్ల కావట్లేదు. పవన్ సర్ నన్ను సరిగ్గా చూడలేదు, ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నారు. నేను కంగారుపడటం చూసి సమంత కంగారుపడకు, సర్ ని షూట్ అయ్యాక పరిచయం చేస్తారు అని చెప్పింది.

Also Read : Mahesh Babu – Pradeep : మహేష్ బాబుకి ప్రదీప్ అంటే ఎంత ఇష్టమంటే.. చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకెళ్లి.. ఛానల్ వాళ్ళతో మాట్లాడి..

షూటింగ్ అయ్యాక త్రివిక్రమ్ సర్ నన్ను చూపించి పరిచయం చేస్తే.. నన్ను చూడగానే నువ్వు టీవీలో చేస్తావు కదా అన్నారు. అంతే నన్ను చూసి గుర్తుపట్టారు అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓ సారి షూట్ బ్రేక్ లో ఆయన నేను కూర్చుంటే నా మెడ మీద చేతులు వేసి మసాజ్ చేస్తున్నట్టు చేసారు. అది త్రివిక్రమ్ గారు ఫోటో తీశారు. పవన్ గారితో నాకున్న ఒకే ఒక్క ఫోటో అది అని తెలిపాడు.

 

Anchor Pawan Kalyan Shares Shooting Experience with Pawan Kalyan in Attarintiki Daredi Movie