వైజాగ్‌లో ఓటు కోసం యాంకర్ రష్మీ కష్టాలు!

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 05:18 AM IST
వైజాగ్‌లో ఓటు కోసం యాంకర్ రష్మీ కష్టాలు!

Updated On : April 11, 2019 / 5:18 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ మొదలైంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఓటు వేయడానికి సొంత ఉర్లకు చేరుకున్నారు. ఇక సామాన్య ఓటర్లే కాకుండా సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పయనం అయ్యారు. తాజాగా బజర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వైజాగ్‌ వెళ్లారు. కానీ పాపం ఆమెకు అక్కడ నిరాశ ఎదురైంది. దాంతో రష్మీ తన సమస్యను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆమె సయస్య ఏంటో చూదామా..?

‘నేను మా అమ్మ ఓటు వేయడం కోసం వైజాగ్ వెళ్లాం. కానీ మా ఓట్లకి సంబంధించిన స్లిప్‌ కాని లిస్ట్ కాని ఇంతవరకూ అందలేదు. ఎప్పటి నుంచో మేము విశాఖపట్నంలోనే ఉంటున్నాము.. ఓటర్ ఐడీ ఇక్కడే ఉంది అయితే మాతో పాటు ఆ ఏరియాలోని ఎవరికీ ఓటర్ స్లిప్పులు అందలేదు’ అంటూంది రష్మి. సరే ఆన్ లైన్‌లో సమాచారం తెలుసుకుందాం అంటే ఎలక్షన్ కమీషన్ వెబ్ సైట్ అందుబాటులో లేదంటూ ఆ సైట్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో పంచుకుంది.

అసలు చివరి నిమిషం వరకూ ఓటు చెక్ చేసుకోకుండా ఏం చేశావ్ అంటూ నెటిజన్ల కామెంట్స్‌ చేశారు. వాళ్ళందరికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది రష్మి. ‘నేను మా అమ్మ ఓటు వేయడం ఇదేమి మొదటిసారి కాదు.. ఇంతకు ముందు కూడా ఓటు వేశాం. కనీసం మా అడ్రస్ కూడా మారలేదు. ఎవరూ చనిపోలేదు కూడా. అంతేకాదు రెగ్యులర్‌గా టాక్స్ కూడా పే చేస్తున్నాం. అలాంటప్పుడు ఓటు లేకుండా పోతుంది అని ఎలా అనుకుంటాం’ అంటూ సమాధానం ఇచ్చింది రష్మి.