ప్రమాదానికి గురైన యాంకర్ రవి కారు – పరారైన డ్రైవర్, క్లీనర్

బుల్లితెర యాంక‌ర్ ర‌వి కారు ప్ర‌మాదానికి గురైంది.. పోలీసులు వ‌చ్చేలోపు ప్రమాదానికి కారకులైన డీసీఎం డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ పరారీ..

  • Published By: sekhar ,Published On : December 9, 2019 / 08:26 AM IST
ప్రమాదానికి గురైన యాంకర్ రవి కారు – పరారైన డ్రైవర్, క్లీనర్

Updated On : December 9, 2019 / 8:26 AM IST

బుల్లితెర యాంక‌ర్ ర‌వి కారు ప్ర‌మాదానికి గురైంది.. పోలీసులు వ‌చ్చేలోపు ప్రమాదానికి కారకులైన డీసీఎం డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ పరారీ..

హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఒకరి నిర్లక్ష్యం మరొకరి నిండు ప్రాణాలు బలిగొనడమే కాక వారి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తుంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా ప్రమాదాలు జరగడం మాత్రం ఆగట్లేదు. తాజాగా బుల్లితెర యాంక‌ర్ ర‌వి కారు ప్ర‌మాదానికి గురైంది.

ఈ ప్ర‌మాదంలో ఆయ‌నకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే కారు మాత్రం డ్యామేజ్ అయింది. శనివారం మూసాపేట నుండి బంజారాహిల్స్ వైపు వ‌స్తున్న రవి కారుని భ‌ర‌త్ న‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ ద‌గ్గ‌ర ఓ డీసీఎం ఢీ కొట్టింది. ఈ విష‌యంపై ర‌వి త‌న యూ ట్యూబ్ ఛానెల్‌ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన డీసీఎం డ్రైవ‌ర్‌ను, క్లీన‌ర్‌ను ప‌ట్టుకుని ప్ర‌శ్నించే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు వారు బాగా మ‌ద్యం సేవించి ఉన్నార‌ని, ‘కొంచెమే తాగాను సార్.. నాకు పెళ్లాం పిల్లలున్నారు సార్’ అని డ్రైవర్ తనను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడని, కూకట్‌పల్లి, సనత్ నగర్ పోలీసుల‌కు తాను ఫోన్ చేసి కంప్లైంట్ చేశానన్నారు రవి.

పోలీసులు వ‌చ్చేలోపు డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ పారిపోయార‌ని, డీసీఎం తాళాలు, ఓనర్ విజిటింగ్ కార్డ్ తీసుకున్నానని, ఇలా మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డిపితే ప్ర‌మాదాలు జ‌రుగుతాయ‌ని ర‌వి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌న‌త్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో డ్రైవ‌ర్‌తో పాటు ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఓన‌ర్‌పై కూడా కేసు వేశానని ర‌వి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.