Sreemukhi: మ్యారేజ్ గురించి మనసులో మాట చెప్పేసింది..!
ప్రమోషన్స్‌లో పాల్గొన్న శ్రీముఖిని తన పెళ్లి గురించి అడగ్గా.. ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది..

Sreemukhi
Sreemukhi: పాపులర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి కొంత గ్యాప్ తర్వాత ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమా చేసింది. సింగర్ మనో, భరణి, రాజా రవీంద్ర మెయిన్ లీడ్స్‌గా నటించిన ఈ మూవీ ఆగస్టు 19న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా టీం ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ప్రమోషన్స్‌లో పాల్గొన్న శ్రీముఖిని తన పెళ్లి గురించి అడగ్గా.. ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది..
‘పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్.. నేను కూడా నా మ్యారేజ్ గురించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. నాకిప్పుడు 28 ఇయర్స్.. 31 సంవత్సరాలు వచ్చే సరికి పెళ్లి చేసుకోవాలని ఉంది. ఎలాగూ మంచి పర్సన్ దొరకడానికి టైం పడతుంది కదా.. చూద్దాం ఏం జరుగుతుందో.. ఎలా జరుగుతుందో’ అంటూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.
ఇక ‘క్రేజీ అంకుల్స్’ విషయానికొస్తే.. ‘తిరుమల తిరుపతి వెంకటేశ’, ‘బెట్టింగ్ బంగార్రాజు’, ‘జంప్ జిలానీ’ లాంటి కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న ఇ. సత్తిబాబు డైరెక్ట్ చేస్తున్నారు. పక్క ఫ్లాట్‌లో అద్దెకి దిగిన అందమైన అమ్మాయి (శ్రీముఖి)ని పడేసేందుకు పోటీ పడే ముగ్గురు అంకుల్స్ రాజు, రెడ్డి, రావు క్యారెక్టర్లలో మనో, భరణి, రాజా రవీంద్ర నటించారు. ప్రోమోస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.