Anil Sunkara : ఆరు దేశాల్లో ఏజెంట్ సినిమా షూటింగ్ చేశాం..
తాజాగా మంగళవారం (ఏప్రిల్ 18) న కాకినాడలో ఏజెంట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మోడ్ లో ఉంది ఏజెంట్ ట్రైలర్. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Anil Sunkara Speech at Agent Trailer Launch Event
Anil Sunkara : అఖిల్ అక్కినేని(Akhil Akkineni) మొదటి సారి ఫుల్ మాస్, యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నాడు ఏజెంట్(Agent) సినిమా ద్వారా. ఇప్పటివరకు అన్నీ లవ్ రోల్స్ చేసిన అఖిల్ ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor) తప్ప చెప్పుకోదగ్గ విజయం సాధించిన సినిమాలు లేవు. దీంతో ఈ సారి భారీ బడ్జెట్ సినిమాతో ఫుల్ యాక్షన్ మోడ్ లో అఖిల్ రాబోతున్నాడు. అఖిల్, సాక్షి వైద్య(Sakshi Viadya) జంటగా, మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఏజెంట్ సినిమా.
ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా మంగళవారం (ఏప్రిల్ 18) న కాకినాడలో ఏజెంట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మోడ్ లో ఉంది ఏజెంట్ ట్రైలర్. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
Agent Trailer : సింహం బోన్‌లోకి వెళ్లి తిరిగొచ్చేది.. ఏజెంట్ ట్రైలర్ వచ్చేసింది..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఏప్రిల్ 28న ప్రేక్షకులు, అభిమానులకు ఒక పండగ, ఉత్సవం. ఏజెంట్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఈ సినిమా తర్వాత ఏజెంట్ అంటే ఒక విగ్రహం గుర్తుకు రావాలని, అది అఖిల్ కావాలి అని నేను, సురేందర్ రెడ్డి అనుకున్నాం. ఈ కోరికని నెరవేర్చాడు అఖిల్. గత రెండేళ్ళుగా చాలా కష్టపడ్డాడు అఖిల్. టీం అంతా కష్టపడి చేసిన సినిమా. యాక్షన్ స్పై జోనర్ ఇది ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఏజెంట్ చాలా ప్రత్యేకం. ఆరు దేశాల్లో డిఫరెంట్ లోకేషన్స్ లో మంచి యాక్షన్ కొరియోగ్రఫర్స్ , స్టంట్స్ తో చేసిన సినిమా ఇది. ఈ చిత్రానికి టీం అంతా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. మమ్ముట్టి, డినో మోరియా వారి బెస్ట్ ఇచ్చారు. మమ్ముట్టి గారి గొప్పదనం ఈ చిత్రంతో మరోసారి చూస్తారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సహకరించిన సినిమాటోగ్రఫీ మంత్రి వేణుగోపాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. సక్సెస్ టూర్ కి మళ్ళీ కాకినాడ వస్తాం. ఏప్రిల్ 28 ఒక పండగలా ఉంటుంది అని అన్నారు. రష్యా, హంగేరి, దుబాయ్, ఇండియా, స్విట్జర్లాండ్, లాటివా.. దేశాల్లో ఏజెంట్ సినిమాని భారీగా చిత్రీకరించారు.