Tripti Dimri : యానిమల్ బ్యూటీ క్రేజ్ మాములుగా లేదు.. రిలీజ్ తరువాత ఇన్‌స్టా ఫాలోవర్స్ కౌంట్..

యానిమల్ మూవీతో అబ్బాయిలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న తృప్తి దిమ్రీ.. సోషల్ మీడియా ఫాలోవర్స్ కౌంట్ వేగంగా పెరుగుతూ ముందుకు దూసుకుపోతుంది.

Tripti Dimri : యానిమల్ బ్యూటీ క్రేజ్ మాములుగా లేదు.. రిలీజ్ తరువాత ఇన్‌స్టా ఫాలోవర్స్ కౌంట్..

Animal movie heroine Tripti Dimri instagram followers count

Updated On : December 10, 2023 / 5:13 PM IST

Tripti Dimri : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన సినిమా ‘యానిమల్’. ప్రస్తుతం ఈ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం 1000 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుంది. కాగా ఈ మూవీలో రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రంతో రష్మిక కంటే తృప్తికి ఎక్కువ ఫేమ్ వస్తుంది. మూవీలో రణబీర్, తృప్తి మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. తృప్తి అందం అబ్బాయిలని ఫిదా చేస్తుంది.

ఇక అబ్బాయిలో తృప్తికి పెరుగుతున్న క్రేజ్‌తో.. సినిమా రిలీజ్ తరువాత ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ కౌంట్ వేగంగా పెరుగుతూ ముందుకు దూసుకుపోతుంది. యానిమల్ రిలీజ్ కి ముందు తృప్తి ఫాలోవర్స్ కౌట్ 600K ఉండేది. ఇప్పుడు ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్ కౌంట్ 3.2 మిలియన్ కి చేరుకుంది. అంటే కేవలం పది రోజుల్లో 6 లక్షల ఫాలోవర్స్ నుంచి 32 లక్షలకు చేరుకుంది. ఈ లెక్క ఇంకా పెరుగుతూనే వెళ్తుంది. ఇక ఈ అమ్మడికి వస్తున్న క్రేజ్ తో మేకర్స్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది.

Also read : Bandla Ganesh : త్రివిక్రమ్‌తో గొడవ గురించి బండ్ల గణేష్ కామెంట్స్.. నేను మనిషినే, నాకు కోపం వస్తుంది..

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

ఈక్రమంలోనే టాలీవుడ్ లో రవితేజతో తెరకెక్కించే ఓ సినిమా కోసం తృప్తిని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. తృప్తి ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నారు. ‘మేరే మెహబూబ్ మేరే సనమ్’, ‘విక్కీ విద్యకా ఓ వాలా వీడియో’ చిత్రాల్లో నటిస్తున్నారు. మేరే మెహబూబ్ మేరే సనమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటూ రిలీజ్ కి సిద్దమవుతుంది.

తృప్తి దిమ్రీ ఉత్తరాఖండ్ కి చెందిన అమ్మాయి. 2017లో శ్రీదేవి ‘మామ్’ అనే సినిమాలో ఓ ముఖ్య పాత్రతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘పోస్టర్ బాయ్స్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన తృప్తి దిమ్రీ.. నాగిని సీరియల్ లో ఓ గెస్ట్ రోల్ కూడా చేసింది. ఇప్పుడు యానిమల్ సినిమాలో జోయా పాత్రలో ప్రేక్షకులని మెప్పిస్తోంది.