Pranay Vanga : బాలీవుడ్‌లో ‘కార్పొరేట్ బుకింగ్స్’ స్కామ్.. సంచలన నిజాలు చెప్పిన నిర్మాత.. అందుకే 1000 కోట్లు?
తాజాగా యానిమల్ సినిమా నిర్మాతల్లో ఒకరైన ప్రణయ్ వంగా బాలీవుడ్ కలెక్షన్స్ పై సంచలన ఆరోపణలు చేశాడు.

Animal Movie Producer Pranay Reddy Vanga Comments on Bollywood Corporate Ticket Bookings Scam goes Viral
Pranay Vanga : బాలీవుడ్(Bollywood) మాఫియా అని మనం వింటూనే ఉంటాం. కొంతమంది బాలీవుడ్ స్టార్స్, అగ్ర దర్శక నిర్మాతలు బాలీవుడ్ ని రూల్ చేస్తూ ఉంటారని, అంతా వాళ్ళు చెప్పినట్టే జరుగుతుందని, కొత్తగా వచ్చేవాళ్ళని, బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళని ఎదగనివ్వరని పలువురు ఆరోపిస్తూ ఉంటారు. దీనిపై రెగ్యులర్ గా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాలు సక్సెస్ సాధిస్తుండటంతో సౌత్ సినిమాలపై బాలీవుడ్ మీడియా విమర్శలు చేయడం, సౌత్ సినిమాలకు థియేటర్స్ ఇవ్వకపోవడం, డబ్బులిచ్చి మరీ సౌత్ సినిమాలపై నెగిటివ్ రివ్యూలు రాయించడం జరుగుతున్నాయి.
తాజాగా సలార్(Salaar) సినిమా విషయంలో అదే జరిగింది. షారుఖ్ డంకీ(Dunki) సినిమా ఉండటంతో షారుఖ్, అతని నిర్మాతలు కలిసి సలార్ కి థియేటర్స్ ఇవ్వకూడదని గట్టిగా ప్రయత్నించారు. అలాగే కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలు సలార్ సినిమాపై విమర్శలు చేశాయి. తాజాగా యానిమల్ సినిమా నిర్మాతల్లో ఒకరైన ప్రణయ్ వంగా బాలీవుడ్ కలెక్షన్స్ పై సంచలన ఆరోపణలు చేశాడు. యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ అన్నయ్య ప్రణయ్ వంగ తమ నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ ని చూసుకుంటున్నారు.
రణబీర్ కపూర్ యానిమల్ సినిమా భారీ విజయం సాధించి దాదాపు 800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. చిత్ర సక్సెస్ లో భాగంగా ప్రణయ్ వంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇక్కడ బాలీవుడ్ లో కార్పొరేట్ టికెట్ బుకింగ్స్ సిస్టమ్ ఉంది. అది మేము ఫాలో అవ్వలేదు. అందుకే మా సినిమాకు 1000 కోట్ల కలెక్షన్స్ రాలేదు. మేం కూడా కొంతమంది బాలీవుడ్ వాళ్ళ లాగా కార్పొరేట్ బుకింగ్స్ చేసుంటే 1000 కోట్ల కలెక్షన్స్ అని చెప్పుకునే వాళ్ళం అని అన్నారు. దీంతో ప్రణయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
దీంతో ఈ కార్పొరేట్ బుకింగ్స్ అనేది సంచలనంగా మారింది. అసలు ఈ కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏంటంటే.. స్టార్ హీరోల సినిమాలకు అనుకున్నంత హైప్ లేకపోతే హీరో లేదా నిర్మాణ సంస్థ కొన్ని కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు వీళ్ళే టికెట్స్ బుక్స్ చేసి ఆన్లైన్ లో ఎక్కువ టికెట్స్ అమ్ముడవుతున్నట్టు చూపిస్తారు. అలాగే ఫ్రీ టికెట్ తో సినిమా చూసిన వాళ్లంతా తమ సోషల్ మీడియాలో సినిమా గురించి ప్రమోట్ చేస్తారు. దీంతో ఇలా ఫేక్ కలెక్షన్స్ సృష్టించి సినిమా బాగున్నా, బాగోకపోయినా బాగున్నట్టు ప్రమోట్ చేయించి కలెక్షన్స్ తెప్పిస్తారు. దీన్నే కార్పొరేట్ బుకింగ్స్ స్కామ్ అంటారు. దీంతో సినిమాని 1000 కోట్ల వరకు తీసుకెళ్తారని, మేము అలా చేయలేదు కాబట్టి మాకు 1000 కోట్లు రాలేదని ప్రణయ్ వంగా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. ఇక సందీప్ వంగా కూడా బాలీవుడ్ మీడియాపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read : Kalyan Ram : డెవిల్ సినిమాతో కళ్యాణ్ రామ్.. ఈ ఏడాదికి గ్రాండ్ ఎండింగ్ ఇస్తారా..?
ఇటీవల సలార్ సినిమా విషయంలో షారుఖ్, అతని నిర్మాతలు చేసిన పనితో గతంలో జవాన్, పఠాన్ సినిమాలకు వచ్చిన కలక్షన్స్ నిజమేనా లేదా అవి ఇలా కార్పొరెట్ బుకింగ్ స్కామ్ తో తెప్పించారా అని పలువురు నెటిజన్లు, తెలుగు ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.