Kalyan Ram : డెవిల్ సినిమాతో కళ్యాణ్ రామ్.. ఈ ఏడాదికి గ్రాండ్‌ ఎండింగ్ ఇస్తారా..?

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రిలీజ్ కాబోతున్న డెవిల్ మూవీతో వస్తున్న కళ్యాణ్ రామ్.. ఈ ఏడాదికి గ్రాండ్‌ ఎండింగ్ ఇస్తారా..?

Kalyan Ram : డెవిల్ సినిమాతో కళ్యాణ్ రామ్.. ఈ ఏడాదికి గ్రాండ్‌ ఎండింగ్ ఇస్తారా..?

Kalyan Ram Samyuktha Menon Devil movie is released on new year celebrations

Updated On : December 25, 2023 / 6:15 PM IST

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’. అభిషేక్ నామా దర్శక నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తూ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీతో వస్తున్న కళ్యాణ్ రామ్.. ఈ ఏడాదికి గ్రాండ్‌ ఎండింగ్ ఇస్తారా..?

గత ఏడాది ‘బింబిసారా’తో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది ‘అమిగోస్’ చిత్రంతో పెద్ద హిట్టుని అందుకోలేకపోయారు. అయితే డెవిల్ సినిమాతో ఎలాగైనా ఒక బ్లాక్ బస్టర్ ని అందుకొని ఈ ఇయర్ ని కూడా గత ఏడాదిలా గ్రాండ్ గా ముగించాలని అనుకుంటున్నారు. మరి డెవిల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ సందడి కనిపిస్తుంది.

Also read : Dil Raju : ‘ఫ్యామిలీ స్టార్’ని పోస్టుపోన్ చేశాను.. ఇతరు నిర్మాతలు కూడా ఆలోచించాలి.. దిల్ రాజు కామెంట్స్..

అయితే డెవిల్ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. బ్రిటిష్ కాలంలో ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడానికి హీరో డెవిల్ ని ఇంగ్లాండ్ ప్రభుత్వం నియమిస్తారు. అయితే డెవిల్ ని ఆ కేసు కోసం కాకుండా మరో కేసు పని మీద నియమించినట్లు తరువాత తెలియజేస్తారు. టైగర్ హంట్ పేరుతో ఒక సీక్రెట్ ఆపరేషన్ ని డెవిల్ చేత బ్రిటిష్ ఆఫీసర్స్ ప్లాన్ చేస్తారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది సినిమా కథ అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది.

ఈ ట్రైలర్ తో ఆడియన్స్ లో మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో సలార్ థియేటర్స్ లో ఉన్న పెద్ద సమస్య ఉండదని తెలుస్తుంది. డిసెంబర్ 29న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ట్రైలర్ చూపించిన విజువల్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.