Dil Raju : ‘ఫ్యామిలీ స్టార్’ని పోస్టుపోన్ చేశాను.. ఇతర నిర్మాతలు కూడా ఆలోచించాలి.. దిల్ రాజు కామెంట్స్..
పొంగల్ ఫైట్ గురించి దిల్ రాజు మీడియా ముందు మాట్లాడారు. 'ఫ్యామిలీ స్టార్'ని పోస్టుపోన్ చేశాను. ఇతరు నిర్మాతలు కూడా ఆలోచించాలంటూ..

Producer Dil Raju about 2024 sankranti movies release issue
Dil Raju : ఈసారి పొంగల్ బరిలో నిలిచేందుకు టాలీవుడ్ లోని చాలామంది మేకర్స్ ఉత్సాహపడుతున్నారు. 2024 సంక్రాంతి పండక్కి.. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హనుమాన్’, వెంకటేష్ ‘సైంధవ్’, రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామిరంగ’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ వస్తున్నట్లు ప్రకటించారు. ఇవే కాకుండా తమిళ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్ ‘లాల్ సలామ్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ కూడా వస్తామంటూ ప్రకటించారు.
అయితే ఇన్ని సినిమాలకు థియేటర్స్ కావాలంటే చాలా కష్టం. దీంతో ఒకటి రెండు సినిమాలు వెనక్కి తగ్గితే బాగుంటుందని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల దిల్ రాజు ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. తాజాగా ఈ పొంగల్ ఫైట్ గురించి దిల్ రాజు మీడియా ముందు మాట్లాడారు.
Also read : కూతురి ఫేస్ రివీల్ చేసిన రణబీర్, అలియా.. ముత్తాత పోలికలే అంటున్న ఫ్యాన్స్..
దిల్ రాజు కామెంట్స్..
అందరికి సంక్రాంతి రిలీజే కావాలి. ఆ పండక్కి వస్తే ఏవో అద్భుతాలు జరుగుతాయని మా నమ్మకం. అయితే ఒకే సమయంలో అన్ని సినిమాలు అంటే థియేటర్స్ దొరకడం కష్టం. అందుకే నేను నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ని సమ్మర్ కి పోస్ట్ చేశాను. ఇక మిగిలిన ఐదు సినిమాల్లో గుంటూరు కారం ముందుగా అనౌన్స్ చేసింది కాబట్టి అది పోస్టుపోన్ అయ్యే ఛాన్స్ లేదు. మిగిలిన నాలుగు సినిమాల నిర్మాతలు ఆలోచించుకోవాలి.
ఈ రెండు మూడు రోజుల్లో దీని పై ఒక క్లారిటీ వస్తుంది. ఆ నాలుగు సినిమాల నిర్మాతల్లో ఎవరైనా వచ్చి వెనక్కి వెళ్తామంటే.. వారికీ సోలో డేట్ చూసి వారికీ కావాల్సిన రిలీజ్ డేట్ ని కేటాయిస్తాము. హనుమాన్ నిర్మాతలు కూడా నన్ను వచ్చి కలిశారు. ఎలా చేస్తే బాగుంటాదని సలహా అడిగారు. వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా లేరని కాంట్రవర్సీలు సృష్టించకండి. ఇక డబ్బింగ్ సినిమాల విషయం మాకు తెలియదు. మన సినిమాలకే థియేటర్స్ లేవంటే వాళ్ళకి ఎక్కడ ఇస్తాము.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినిమా పరిశ్రమ భేటీ గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. “సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని ఇటీవల కలుసుకున్నాము. సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకోని ఒక డేట్ చెబుతా అన్నారు. ఆరోజు టాలీవుడ్ ప్రముఖులు సీఎం గారిని కలుస్తాము” అంటూ చెప్పుకొచ్చారు.