Anirudh Ravichander : వామ్మో అనిరుధ్ మూవీ లైనప్ చూసారా.. ఒకేసారి అన్ని సినిమాలా.

Anirudh Ravichander movie line up
Anirudh Ravichander : దేశ వ్యాప్తంగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా తమిళ సినీ ఇండస్ట్రీ లో పని చేసినా కూడా , ఇటీవల పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతే కాదు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ స్టార్ హీరోలకి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ మూవీ లైనప్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు దాదాపుగా 12 సినిమాలు చేస్తున్నాడు. ఇక అందులో ఎక్కువ సినిమాలు తెలుగే అవ్వడం గమనార్హం. ఇక సినిమాలు ఏంటంటే.. కూలీ, దేవర 2, భారతీయుడు3, కింగ్ , #LIK, మ్యాజిక్, నాని ఓదెల 2, తలపతి 69, VD12, విడముయార్చి ఇలా భాషతో సంబంధం లేకుండా బిజీగా ఉన్నాడు.
Also Read : Donald Trump : ట్రంప్ విజయంతో దేశం వదిలి వెళ్ళిపోతామంటున్న సెలబ్రిటీలు..
ఇక అనిరుధ్ మ్యూజిక్ అందించిన అన్నిసినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. అందుకే చాలా మంది స్టార్ డైరెక్టర్స్ సైతం అనిరుధ్ కోసం క్యూ కడుతున్నారు. మొత్తానికి అన్ని భాషల్లో తన మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.