Donald Trump : ట్రంప్ విజయంతో దేశం వదిలి వెళ్ళిపోతామంటున్న సెలబ్రిటీలు..

Celebrities who want to leave the country with Trump success
Donald Trump : 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, జెడి వాన్స్ విజయంపై చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయమై పలువురు ప్రముఖులు అసంతృప్తిగా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ మరియు JD వాన్స్ నవంబర్ 6, 2024 తెల్లవారుజామున ఫ్లోరిడాలో తమ విజయానికి సంబందించిన స్పీచ్ ఇచ్చారు.
Also Read : Salman Khan : సల్మాన్ ఖాన్ బెదిరింపు కేసులో ఓ వ్యక్తి అరెస్ట్..
“మీ అందరికీ చాలా పెద్ద థాంక్స్. నేను మిమ్మల్ని ఎప్పటికి వదలను. అమెరికా భవిష్యత్తు ఇంతకు ముందు కంటే మెరుగ్గా, ధైర్యంగా, ధనవంతంగా, సురక్షితమైనదిగా, బలంగాచేస్తాము. దేవుడు మిమ్మల్ని అమెరికాను ఆశీర్వదిస్తాడు.. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. అంటూ పేర్కొన్నారు”.
అయితే ఈ ఫలితాలతో అసంతృప్తిగా ఉన్న సెలబ్రిటీస్ దేశం విడిచి వెళ్లాలని అనుకుంటున్నారు. అందులో..
రావెన్-సైమోన్ మాట్లాడుతూ . . రిపబ్లికన్ ఎన్నికల్లో గెలిస్తే తాను దేశం విడిచి వెళ్లిపోతానని అన్నారు.
Raven Symone speaks on Kamala Harris on her podcast “Tea Time” with her Wife Miranda Maday. pic.twitter.com/ED8gR5POXj
— popbrains (@popbrains) July 31, 2024
ప్రముఖ సింగర్ చెర్ సైతం దీనిపై స్పందిస్తూ.. అతను గెలిస్తే “గ్రహాన్ని విడిచిపెడతాను” అని ట్రంప్ మొదటి అధ్యక్ష ఎన్నికల సమయంలో చెప్పింది.
View this post on Instagram
నెవ్ కాంప్‌బెల్ సైతం..పబ్లికన్ అభ్యర్థి అధ్యక్ష పదవిని గెలిస్తే తాను కూడా “కెనడాకు తిరిగి వెళ్తాను” అని తెలిపింది.