మగబిడ్డకు జన్మనిచ్చిన ‘నువ్వు నేను’ అనిత..

మగబిడ్డకు జన్మనిచ్చిన ‘నువ్వు నేను’ అనిత..

Updated On : February 10, 2021 / 12:53 PM IST

Anita Hassanandani: ‘నువ్వు నేను’ సినిమాతో ప్రేక్షకులకు ఆకట్టుకుని తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకుంది అనిత. అలియాస్ ‘నువ్వు నేను’ అనిత. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసి పర్సనల్ లైఫ్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న అనిత ఇటీవల తాను త్వరలో తల్లిని కాబోతున్నానని వెల్లడించారు.

మంగళవారం (ఫిబ్రవరి 9) ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఏక్తా కపూర్ వంటి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాస్పిటల్‌కి అనితను బిడ్డను చూడడంతో పాటు సోషల్ మీడియా ద్వారా అనిత, రోహిత్ దంపతులకు విషెస్ తెలుపుతున్నారు.

2013లో బిజినెస్‌మెన్ రోహిత్ రెడ్డిని అనిత వివాహం చేసుకున్నారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత తొలి సంతానానికి జన్మనిచ్చారామె. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)