బికినీ ఫోటోకి మేకప్ అవసరమా? నటుడి భార్యకి నెటిజన్ ప్రశ్న.. ఆమె ఆన్సర్ అదుర్స్..

బాలీవుడ్ మిలింద్ సోమన్ భార్య అంకితా కోన్వార్ బికినీ ఫోటో వైరల్..

  • Published By: sekhar ,Published On : April 2, 2020 / 02:59 PM IST
బికినీ ఫోటోకి మేకప్ అవసరమా? నటుడి భార్యకి నెటిజన్ ప్రశ్న.. ఆమె ఆన్సర్ అదుర్స్..

Updated On : April 2, 2020 / 2:59 PM IST

బాలీవుడ్ మిలింద్ సోమన్ భార్య అంకితా కోన్వార్ బికినీ ఫోటో వైరల్..

మడిసన్నాక కాసింత కళాపోషణుండాలన్నారు ముత్యాలముగ్గు సినిమాలో విలక్షణ నటుడు రావుగోపాల రావు.. ఈరోజుల్లో అందరిలోనూ క్వింటాళ్ల కొద్దీ ఉంది కళాపోషణ.. వాటిలో ఫోటో అనేది ఒక కళ.. ప్రస్తుత ట్రెండ్‌లో మేక‌ప్ వేసుకోకపోయినా అందంగా క‌నిపించేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో లేటెస్ట్ యాప్స్, ఫీచర్స్ కలిగిన ఫోన్లు మార్కెట్లో కుప్ప‌లు తెప్ప‌లుగా ఉన్నాయి. ఇక ఏ ఫోటో పోస్ట్ చేయాల‌న్నా దానికి కాస్తంత కోటింగ్ (ఎడిటింగ్) ఇవ్వనిదే సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయట్లేదు చాలా మంది. సెలబ్రిటీలు దీనికేం మినహాయింపు కాదండోయ్. తాజాగా అకింతా కోన్వార్‌ పోస్ట్ చేసిన ఫోటో ఈ వార్తలకు మూలం.

క‌రోనా వైర‌స్ కారణంగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమ అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ న‌టుడు మిలింద్ సోమ‌న్ భార్య అకింతా కోన్వార్‌ కొత్తగా ఏదైనా చేయాలనుకుని గ‌తేడాది బికినీలో తీసుకున్న పాత ఫోటోను అభిమానుల‌తో పంచుకుంది.
అయితే పోయిన సంవత్సరం వేస‌వి కాలానికీ ఇప్ప‌టి స‌మ్మ‌ర్‌కు ప‌రిస్థితులు ఎంత‌గానో మారిపోయాయ‌ని చెబుతూ..‘‘గ‌తేడాది వేస‌విని ఎంజాయ్ చేసాం. ఇప్పుడు దానికి కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంది పరిస్థితి. ఎటువైపు వెళుతున్నామో..’’ అంటూ ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తూ బికినీతో ఉన్న పిక్ షేర్ చేసింది..

Ankita Konwar

‘‘స్కిన్‌టోన్ కాంతివంతంగా క‌నిపించడానికి ఫోటోను అంత‌లా ఎందుకు ఎడిట్ చేశారు? మీ చామ‌న‌ఛాయ రంగే మాకు న‌చ్చుతుంద’’ని ఒక ఔత్సాహికుడైన నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘ఇది కేవ‌లం ఇన్‌స్టాగ్రామ్ ఫిల్ట‌ర్ హనీ..’’ అంటూ రిప్లై ఇచ్చిందామె. క్వారంటైన్ వేళ ఆమె త‌న భ‌ర్త‌తో క‌లిసున్న ఫోటోల‌ను సైతం పంచుకుంటూ అభిమానుల‌తో నిత్యం ట‌చ్‌లో ఉంటోంది. ఇక వయసు పరంగా చాలా వత్యాసం ఉన్న మిలింద్, అంకితా తమ మధ్య ప్రేమలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు అంటున్నారు.

Ankita Konwar

Read Also : నా భర్తని అందుకే పెళ్లి చేసుకున్నా.. ఆర్య, బన్నీ మీరూ ఆ పని చేయండి మరి..