Beauty Song : ‘బ్యూటీ’ నుంచి బ్యూటిఫుల్ కన్నమ్మ సాంగ్ విడుదల..
తాజాగా 'బ్యూటీ' నుంచి ఓ బ్యూటీఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

Ankith Koyya Nilakhi Patra Beauty Movie Song Released
Beauty Song : అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా ఆతెరకెక్కుతున్న సినిమా బ్యూటీ. వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ సంయుక్త నిర్మాణంలో జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే బ్యూటీ సినిమా నుంచి పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా ఓ బ్యూటీఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘కన్నమ్మ కన్నమ్మ నేనే నువ్వా..’ అంటూ సాగే ఈ పాటను విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకత్వంలో సనారే రాయగా ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన పాడారు. ఈ సాంగ్ విజువల్స్ కూడా బాగున్నాయి. మీరు కూడా ఈ పాట వినేయండి..
ఈ సినిమాలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా.. పలువురు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. బ్యూటీ సినిమాని సమ్మర్లోనే రిలీజ్ చేయనున్నారు.