Annapurna Studios : 47 ఏళ్లుగా అన్నపూర్ణ స్టూడియోస్‌ లోనే పని చేస్తున్న ఎంప్లాయ్‌.. స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పిన నాగార్జున, సుప్రియ..

సంస్థ పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా దాదాపు 47 ఏళ్లుగా తమ దగ్గరే అన్నపూర్ణ స్టూడియోస్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్న రామాచారి అనే సీనియర్ ఎంప్లాయ్ కి నాగార్జున, సుప్రియ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తూ ఓ వీడియో చేసి రిలీజ్ చేశారు.

Annapurna Studios : 47 ఏళ్లుగా అన్నపూర్ణ స్టూడియోస్‌ లోనే పని చేస్తున్న ఎంప్లాయ్‌.. స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పిన నాగార్జున, సుప్రియ..

Annapurna Studios says Special Thanks to their First Employee who still working for them since 47 Years

Updated On : October 21, 2023 / 10:59 AM IST

Annapurna Studios :  అక్కినేని నాగేశ్వరరావు సినీ పరిశ్రమని చెన్నై(Chennai) నుంచి హైదరాబాద్(Hyderabad) కి తరలించాక ఇక్కడ సినిమా వాళ్ళు ఇబ్బంది పడకూడదని, సినిమా మరింత అభివృద్ధి చెందాలని, ఇక్కడే అన్ని పనులు జరగాలని అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించారు. ఆ తర్వాత దాన్ని నాగార్జున(Nagarjuna), అమల, సుప్రియ అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఒక పెద్ద సంస్థ. అందులో ఎంతో మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

అయితే సంస్థ పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా దాదాపు 47 ఏళ్లుగా తమ దగ్గరే అన్నపూర్ణ స్టూడియోస్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్న రామాచారి అనే సీనియర్ ఎంప్లాయ్ కి నాగార్జున, సుప్రియ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తూ ఓ వీడియో చేసి రిలీజ్ చేశారు.

రామాచారి అనే వ్యక్తి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించినప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గర మొదటి ఎంప్లాయ్ గా చేరారని, 47 ఏళ్లుగా నిజాయితీగా పనిచేస్తున్నారని, ఇప్పుడు ఆయనకు 80 ఏళ్ళు వచ్చినా ఇంకా అదే యాక్టివ్ గా పనిచేస్తారని, మా డబ్బులు అన్ని ఇనప్పెట్టెల్లో ఉన్నా దాని తాళం ఆయనకు ఇచ్చేసి హ్యాపీగా ఉండొచ్చని నాగార్జున చెప్తూ.. ఇన్నాళ్లుగా తమకు పనిచేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు.

Annapurna Studios says Special Thanks to their First Employee who still working for them since 47 Years

Also Read : Raghava Lawrence : బాబా సెహగల్‌కి స్టేజిపైనే బంపరాఫర్ ఇచ్చిన లారెన్స్ మాస్టర్..

ఇక సుప్రియ ఆ వీడియోలో మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు ఆయనతో ఆడుకున్నాను, అప్పట్నుంచి ఆయన నాకు తెలుసు. ఇప్పటికి, ఇన్నేళ్ళుగా ఆయన అలాగే పని చేస్తుండటం మా అదృష్టం అని తెలిపారు. అలాగే రామాచారి మాట్లాడుతూ.. ఇక్కడ పనిచేయడం అదృష్టం అని, తనని ఫ్యామిలీ మెంబెర్ లా చూసుకుంటారు అని, నేను ఇల్లు కట్టుకోవడానికి కూడా సహాయం చేశారని తెలిపారు. హీరోస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ అనే సిరీస్ లో భాగంగా అక్కడ పనిచేస్తున్న వారి గురించి అందరికి తెలియాలని ఈ ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇలా తమ దగ్గర పని చేస్తున్న ఓ ఉద్యోగి గురించి సంస్థ అధినేతలే పాజిటివ్ గా చెప్తూ, థ్యాంక్స్ చెప్తూ వీడియో రిలీజ్ చేయడంతో అంతా నాగార్జున, సుప్రియలను అభినందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Annapurna Studios (@annapurnastudios)