Anni Manchi Sakunamule: అన్నీ మంచి శకనుములే కోసం వస్తున్న ఇద్దరు స్టార్స్.. ఎవరంటే..?

యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్‌లు జంటగా నటించిన ‘అన్నీ మంచి శకునములే’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు నాని, దుల్కర్ సాల్మాన్ చీఫ్ గెస్టుగా రానున్నట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది.

Anni Manchi Sakunamule: అన్నీ మంచి శకనుములే కోసం వస్తున్న ఇద్దరు స్టార్స్.. ఎవరంటే..?

Anni Manchi Sakunamule Pre-Release Event To Be Graced By Two Heroes

Anni Manchi Sakunamule Pre-Release Event: యంగ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మాళవిక నాయర్ జంటగా నటిస్తోన్న ‘అన్నీ మంచి శకునములే’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Anni Manchi Sakunamule: ఎన్టీఆర్ లాంచ్ చేసిన ట్రైలర్.. ఇకపై నిజంగానే ‘అన్నీ మంచి శకునములే’..!

ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అవుతున్నాయి. కాగా, రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అయ్యింది.

Anni Manchi Sakunamule : అన్నీ మంచి శకునములే సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

మే 14న సాయంత్రం 6 గంటల నుండి ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిలుగా నేచురల్ స్టార్ నాని, మలయాళ యంగ్ హీరో దుల్కర్ సాల్మన్‌లు హాజరుకానున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యాయి.