Pushpa2: పుష్పరాజ్ కోసం మరో బాలీవుడ్ హీరో.. ఎవరంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో, ప్రేక్షకులు ఈ సినిమాకు నీరాజనాలు పలికారు. ఇక పుష్ప-2 చిత్రాన్ని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. పుష్ప-2 సినిమాలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించేందుకు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌ను సంప్రదిస్తున్నారట చిత్ర యూనిట్.

Another Bollywood Actor For Allu Arjun Pushpa 2
Pushpa2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో, ప్రేక్షకులు ఈ సినిమాకు నీరాజనాలు పలికారు. ఇక ఈ మూవీలో బన్నీ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఆయన కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
Pushpa 2: పుష్ప-2 కోసం మూడు.. దేవిశ్రీ ప్రసాద్ సెన్సేషన్!
ఇప్పుడు ఈ సక్సెస్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ‘పుష్ప-2’ మూవీతో బన్నీ అండ్ టీమ్ రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా చిత్ర యూనిట్ ప్రారంభించింది. అయితే పుష్ప పాన్ ఇండియా ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకోవడంతో, ఇప్పుడు పుష్ప-2 చిత్రాన్ని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో భారీ క్యాస్టింగ్‌ను ఈ సినిమాలో తీసుకుంటున్నాడు దర్శకుడు సుకుమార్. ఇప్పటికే దక్షిణాది స్టార్స్‌ను ఈ సినిమాలో నటింపజేస్తున్న సుకుమార్, ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్స్‌ను కూడా దించనున్నాడట.
Pushpa 2: పుష్ప-2.. మరింత గ్రాండియర్‌గా రాబోతున్న పుష్పరాజ్!
పుష్ప-2 సినిమాలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించేందుకు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌ను సంప్రదిస్తున్నారట చిత్ర యూనిట్. ఈ చిత్రంలో మరో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉంటుందని.. ఈ పాత్ర కోసమే అర్జున్ కపూర్‌ను చిత్ర యూనిట్ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్‌లో డీలా పడ్డ ఈ హీరో, మరి ఈ ఆఫర్‌ను ఓకే చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా పుష్ప-2 సినిమా విషయంలో ‘తగ్గేదే లే’ అనే తీరులో చిత్ర యూనిట్ దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.