Unstoppable with NBK: బాలయ్యతో రోజా.. మరో క్రేజీ ఎపిసోడ్ ఖాయం?
తెలుగు ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని అందిస్తామని ప్రామిస్ చేసిన తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది.

Unstoppable With Nbk
Unstoppable with NBK: తెలుగు ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని అందిస్తామని ప్రామిస్ చేసిన తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. ఒకవైపు బ్లాక్‌బస్టర్ సినిమాలు మరోవైపు పాపులర్ షోలు, ఆకట్టకునే వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక, నటసింహం నందమూరి బాలకృష్ణతో ‘Unstoppable with NBK’ టాక్ షో తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ షోలో వచ్చిన ఎపిసోడ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్ కొట్టాయి.
Etharkkum Thunindhavan: సూర్య నెక్స్ట్ సినిమా.. థియేటర్‌లోనా.. ఓటీటీలోనా?
ఇదే ఊపులో అంతకు మించి అనేలా స్పెషల్ గెస్టులను ఈ షో కోసం పట్టుకొస్తున్నారు షో నిర్వాహకులు. ఈమధ్యనే నేచురల్ స్టార్ నానీతో సరదాతో పాటు ఎమోషనల్ ఎపిసోడ్ అందించిన ఆహా త్వరలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మరో ఎపిసోడ్ ను సిద్ధం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక, ఇప్పుడు మరో స్పెషల్ గెస్ట్ తో మరో ఎపిసోడ్ చేయనున్నట్లుగా జరుగుతున్న ఓ ప్రచారం మరింత ఆసక్తికరంగా మారింది. ఆ గెస్ట్ ఎవరో కాదు నటి, ఎమ్మెల్యే రోజా సెల్వమణి.
Chiru 154: మలయాళ సినిమా కథతోనే చిరుతో బాబీ సినిమా?
ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జిగా వ్యహరిస్తున్న రోజా ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అన్న సంగతి తెలిసిందే. అయితే.. బాలయ్య ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఎమ్మెల్యే. ఒకప్పుడు ఇద్దరూ కలిసి నటించిన హీరోహీరోయిన్లు కాగా ఈ కాంబినేషన్ కు అప్పట్లో సూపర్ క్రేజీ సొంతం. మరి ఇప్పుడు రోజాను బాలయ్య ఎలాంటి ప్రశ్నలను సంధించనున్నారు..? ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా సమాధానాలు ఎలా ఉండనున్నాయి?.. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.