Prabhas: మొదలుకానున్న మరో సినిమా.. ప్రభాస్ నువ్వు గ్రేట్ బాసూ!
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఒకప్పుడు ఒక్క సినిమాకి 2,3 ఏళ్లు టైమ్ తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు ఒకేసారి 4 సినిమాల్ని లైనప్..

Prabhas
Prabhas: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఒకప్పుడు ఒక్క సినిమాకి 2,3 ఏళ్లు టైమ్ తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు ఒకేసారి 4 సినిమాల్ని లైనప్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు సినిమా సినిమాకీ బాగా గ్యాప్ తీసుకునే ప్రభాస్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైన్లో పెట్టాడు. లేట్ అవుతుందని కమిట్ అవ్వడం కాకుండా ఈ సినిమాల్ని కూడా జెట్ స్పీడ్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాల్ని అంతే స్పీడ్‌గా రిలీజ్‌కి కూడా రెడీ చేస్తున్నారు.
Nani: ‘గే’ పాత్రలో నవ్వించనున్న నేచురల్ స్టార్?
ఆల్రెడీ ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కు రెడీగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ముహూర్తం పెట్టేశారు. ఆ తరువాత సమ్మర్ కి సలార్ ప్లాన్ చేస్తుండగా ఆ తర్వాత ఆదిపురుష్ సిద్ధంగా ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమాల షూటింగ్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్న రెబల్ స్టార్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా ప్రాజెక్ట్ K ను కూడా షూటింగ్ మొదలు పెట్టేశాడు. దీంతో సాహో తర్వాత నాలుగు సినిమాలు షూటింగ్, ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇవి చాలవని మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టేశాడు.
Sadha: మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం ‘సదా’ సమ్మోహనం!
ప్రభాస్ కెరీర్ లో సాహో 19వ సినిమా కాగా.. నాగ్ అశ్విన్ తో చేసేది 23వ సినిమా. కాగా, ఇప్పుడు ప్రభాస్ 25వ సినిమాను మొదలుపెట్టేయనున్నాడు. ఈ నెల 7న ఈ సినిమాను ప్రకటించనుండగా ఏ దర్శకుడితో ఏ బ్యానర్‌లో చేయనున్నరనేది ఆరోజే ప్రకటించనున్నారు. కాగా, ఇప్పటికే 24వ సినిమాను సిద్దార్థ్ ఆనంద్‌తో చేయనున్నట్టు తెలుస్తుండగా ఆ సినిమా మొదలు కాకముందే 25వ సినిమాను కూడా ప్రకటించడం విశేషం. దీనిని బట్టి చూస్తే ప్రభాస్ ఏకంగా అరడజను పాన్ ఇండియా సినిమాలతో సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్ తో సినిమాలు సిద్ధం చేస్తున్నాడు.