Anupama Parameswaran: అనుపమ.. అందుకే అలాంటి సినిమాలు చేయడం లేదా?

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. అయితే అనుపమ మాత్రం వచ్చిన ప్రతి సినిమాను చేసుకుంటూ పోవడం లేదు. కేవలం సెలెక్టెడ్ సినిమాలను మాత్రమే అమ్మడు చేస్తూ వస్తోంది.

Anupama Parameswaran: అనుపమ.. అందుకే అలాంటి సినిమాలు చేయడం లేదా?

Anupama Parameswaran About Rejecting Star Heroes Movies

Updated On : August 26, 2022 / 8:58 PM IST

Anupama Parameswaran: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. అనుపమ తమ సినిమాలో నటించిందంటే, ఆ సినిమా గ్యారెంటీ హిట్ అనే ముద్రను కూడా సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. అయితే అనుపమ మాత్రం వచ్చిన ప్రతి సినిమాను చేసుకుంటూ పోవడం లేదు. కేవలం సెలెక్టెడ్ సినిమాలను మాత్రమే అమ్మడు చేస్తూ వస్తోంది. అయితే దీని వెనకాల బలమైన రీజన్ కూడా ఉందని అంటోంది.

Anupama Parameswaran: కార్తికేయ-2 టీమ్‌కు షాక్.. అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా పాజిటివ్!

అనుపమకు స్టార్ హీరోల సినిమా ఛాన్సులు కూడా బోలెడన్నీ వస్తున్నాయట. అయితే ఎక్కువ సినిమాల్లో హీరోను ఎలివేట్ చేయడంతోనే కథ సాగుతుండటం అమ్మడికి నచ్చలేదట. ఆ సినిమాల్లో హీరోయిన్ పాత్ర కేవలం పేరుకే ఉండటంతో వాటిని రిజెక్ట్ చేసినట్లుగా అనుపమ తెలిపింది. తనకు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా ప్రాధాన్యతను కలిగి ఉంటేనే ఆ సినిమా నచ్చుతుందని అనుపమ అంటోంది. అందుకే తాను ఎక్కువగా కథే హీరోగా ఉండే సినిమాలను ఎంచుకుంటూ వెళ్తున్నానని చెప్పుకొచ్చింది.

Anupama Parameswaran : సినిమా హిట్ అయినా నాకు బాధగానే ఉంది.. కార్తికేయ 2పై అనుపమ పరమేశ్వరన్ వ్యాఖ్యలు..

ఏదేమైనా అనుపమ కెరీర్‌లో ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలు కేవలం ఉన్నాయంటే ఉన్నాయి అనే రీతిలో కాకుండా, సినిమాలో తన పాత్ర కూడా ప్రాధాన్యతను కలిగి ఉండటంతో ఆమె అభిమానులు తనను ఆదరిస్తూ వస్తున్నారని ఆమె అంటోంది. ఇటీవల కార్తికేయ-2 సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అనుపమ, త్వరలోనే ‘18 పేజీస్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఆ సినిమాలో అమ్మడి పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.