Anupama Parameswaran : లేడీ మల్టీస్టారర్.. అనుపమ పరమేశ్వరన్ తో మరో మలయాళీ హీరోయిన్.. సూపర్ కాంబో
గత సంవత్సరం 'సినిమా బండి' సినిమాతో ప్రేక్షకులని మెప్పించి పలు అవార్డులు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల. ఇటీవల ప్రవీణ్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాను అని ప్రకటించాడు.

Anupama Parameswaran Darshana Rajendran Multi starer in Praveen Kandregula Direction
Darshana Rajendran : అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. వరుస హిట్స్ తో, సోషల్ మీడియాలో వరుస పోస్టులతో తెలుగులో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అనుపమ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. తాజాగా అనుపమ ఓ కొత్త సినిమాకు ఓకే చెప్పింది. అయితే ఇది లేడీ మల్టీస్టారర్ లాంటి సినిమా.
గత సంవత్సరం ‘సినిమా బండి’ సినిమాతో ప్రేక్షకులని మెప్పించి పలు అవార్డులు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల. ఇటీవల ప్రవీణ్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాను అని ప్రకటించాడు. ఈ సినిమాలో అనుపమతో పాటు మరో మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ కూడా నటించబోతుంది. మలయాళంలో పలు సినిమాలు చేసిన దర్శన ఇటీవల హృదయం, జయజయ జయహే సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకుంది. దర్శనకు ఇది మొదటి తెలుగు సినిమా కావడం విశేషం.
Animal : యానిమల్ ప్రీ టీజర్ రిలీజ్.. గొడ్డలి పట్టిన రణబీర్ కపూర్..
అంతే కాకుండా ఈ సినిమాలో సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్ర పోషించబోతుంది. ఇద్దరు కథానాయికలతో ట్రావెలింగ్ నేపథ్యంలో సాగే సినిమా అని సమాచారం. దర్శన తెలుగులో ఎంట్రీ ఇస్తుండటం, అనుపమ లేడీ ఓరియెంటెడ్ కావడం, సినిమా బండి దర్శకుడి నెక్స్ట్ సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూట్ ని మొదలుపెట్టనున్నారు. దర్శకుడు ప్రవీణ్ ఈ హీరోయిన్స్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి తన నెక్స్ట్ సినిమా అని ప్రకటించాడు.