Virat – Anushka : విరాట్ కోహ్లీని అనుష్క శర్మ కొట్టిందా.. గాయాలతో కింగ్ పిక్..

విరాట్ కోహ్లీని అనుష్క శర్మ కొట్టిందా. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన పిక్ వైరల్ అవుతుంది.

Virat – Anushka : విరాట్ కోహ్లీని అనుష్క శర్మ కొట్టిందా.. గాయాలతో కింగ్ పిక్..

Anushka Sharma is really hit Virat Kohli news gone viral

Updated On : November 27, 2023 / 4:53 PM IST

Virat Kohli – Anushka Sharma : స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ‘వామిక’కు జన్మనించి తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఈ ఇద్దరు ఎంత ప్రేమగా ఉంటారో ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్‌లా కాకుండా ఒక ఫ్రెండ్స్ లా కనిపిస్తుంటారు. ఎక్కడ కనిపించినా ఇద్దరు కలిసి అల్లరి చేస్తూ కనిపిస్తారు. సోషల్ మీడియా ద్వారా కూడా తమ ఫన్నీ మూమెంట్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు.

తాజాగా విరాట్ కోహ్లీ తాన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్టులో విరాట్ మొఖం మీద గాయాలతో కనిపిస్తున్నారు. దానికి విరాట్ ఇలా రాసుకొచ్చారు.. “మీరు చూస్తున్నది వేరే వ్యక్తిని” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ పోస్టు చూసిన నెటిజెన్స్ దీని మీద ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. “కొంపతీసి అనుష్క చేతిలో కింగ్ దెబ్బలు తిన్నాడా ఏంటి?” అంటూ ఫన్నీ పోస్టులు చేస్తున్నారు. అయితే ఇది పుమా యాడ్ కోసం చేస్తున్న సెట్స్ లోని పిక్ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ అయితే నెట్టింట వైరల్ గా మారింది.

Anushka Sharma is really hit Virat Kohli news gone viral

Also read : Animal Movie : యానిమల్ మూవీలో చూపించిన.. భారీ మెషిన్ గన్‌ని నిజంగా తయారు చేశారు

ఇది ఇలా ఉంటే, ఇటీవల అనుష్క మళ్ళీ తల్లి కాబోతున్నారంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది. ఇటీవల ఒక హోటల్ విరాట్ అండ్ అనుష్క కలిసి కనిపించిన సమయంలో అనుష్క బేబీ బంప్ తో కనిపించారంటూ, ఆమె ప్రెగ్నెన్సీతో ఉన్నారంటూ బి-టౌన్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తల్లో నిజమెంత ఉందో అనేది మాత్రం తెలియలేదు. కింగ్ అభిమానులు అయితే వారసుడు కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో కోహ్లీ అండ్ అనుష్క ఎప్పుడు తమకి ఒక శుభవార్త చెప్పబోతున్నారో అని ఎదురు చూస్తున్నారు. అందుకనే ఈ ప్రెగ్నెన్సీ రూమర్స్ మాటిమాటికి నెట్టింట వైరల్ అవుతున్నాయి.