సినిమా చూసాడు- సత్కరించాడు

  • Published By: sekhar ,Published On : January 11, 2019 / 08:20 AM IST
సినిమా చూసాడు- సత్కరించాడు

Updated On : January 11, 2019 / 8:20 AM IST

ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్, ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ సినీ ప్రయాణం, ఒడిదుడుకులను ఎదర్కొని సూపర్ స్టార్‌గా ప్రజల్లో తిరుగులేని స్టార్‌డమ్‌ని సంపాదించుకోవడం, తనని గొప్పవాణ్ణి చేసిన ప్రజల బాగుకోసం పార్టీని స్థాపించడం వంటివి ఎన్టీఆర్ కథానాయకుడులో చూపించారు. రీసెంట్‌గా ఏపీ సీఎమ్, నారా చంద్రబాబు నాయుడు ఈ సినిమాని చూసారు. విజయవాడ బెంజిసర్కిల్‌లోని ట్రెండ్‌ సెట్ మాల్‌లో, బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్, మరికొద్ది మంది ప్రముఖులతో కలిసి చంద్రబాబు కథానాయకుడు చూసారు.

సినిమా చూసాక బాలయ్య, క్రిష్‌లను సత్కరించిన బాబు, ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో బాలకృష్ణ అద్భుతంగా నటించారనీ, ఆ మహానటుడి జీవితాన్నీ, త్యాగాన్నీ, కార్యదక్షతనీ తెరపై క్రిష్ అత్యద్భుతంగా చూపించారనీ చంద్రబాబు ఎన్టీఆర్ కథానాయకుడు టీమ్‌ని ప్రశంసించారు.
ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్, ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

వాచ్ ట్రైలర్…