Nara Rohith : ఎన్నికల్లో పోటీ చేస్తాను.. పార్టీ కోసం ఎప్పుడైనా నిలబెడతాను.. నాకెలాంటి నామినేటెడ్ పోస్ట్ లు వద్దు..
ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు.

Nara Rohith Wants to Enter in Politics
Nara Rohith : హీరో నారా రోహిత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్న కొడుకు అని అందరికి తెలిసిందే. బాణం సినిమాతో హీరోగా వచ్చి మంచి హిట్ కొట్టాడు. గతంలో వరుస సినిమాలు చేస్తూ పలు విజయాలు సాధించిన నారా రోహిత్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు నారా రోహిత్ మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి భైరవం అనే సినిమాతో మే 30న వస్తున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు.
Also Read : Trivikram – Venkatesh : త్రివిక్రమ్ – వెంకీమామ సినిమా.. అసలు సంగతేంటి.. బన్నీ వెళ్లిపోవడంతో..
నారా రోహిత్ మాట్లాడుతూ.. నేను చిన్నప్పట్నుంచి పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి ఆటోమేటిక్ గా ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. గత ఎన్నికల్లో ఒక 12 సభల్లో ప్రచారంలో పాల్గొన్నాను. సరైన సమయం వచ్చినప్పుడే డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తాను. 2024లో కరెక్ట్ టైం కాదు. 2029లో చూడాలి. పార్టీ కోసం ఎప్పుడైనా నిలబెడతాను. నాకెలాంటి నామినేటెడ్ పోస్ట్ లు వద్దు. నాకు అవసరం కూడా లేదు.
ఇప్పటికి ప్రతి నెల మా ఊరికి వెళ్లి అక్కడ ప్రజలను కలుస్తాను. వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే చెప్తారు. నా పరిధిలో ఉన్నవి తెలిసిన లోకల్ నాయకులకు చెప్పి చేయించడానికి చూస్తాను. అక్కడ ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ ఉంటారు. నేను మెంటల్లీ ప్రిపేర్ అయి ఎన్నికల్లో పోటీ చేస్తాను అనుకున్నప్పుడు మొదట పెదనాన్నకే చెప్తాను. ఆ తర్వాత లోకేష్ కి చెప్తాను అని తెలిపారు. దీంతో భవిష్యత్తులో నారా రోహిత్ కూడా ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తాడని తెలుస్తుంది.
Also Read : Allu Arjun – Atlee : ఆగిపోయిన సినిమా టైటిల్ బయటకు తీసిన అల్లు అర్జున్.. అట్లీతో సినిమా టైటిల్ అదేనా?