సూపర్ స్టార్ రజనీకాంత్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్‌తో ఫోనులో మాట్లాడి..

సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ అనారోగ్యంతో బాధపడతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. రజనీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
రజనీకాంత్‌తో ఫోనులో మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కాగా, రజనీకాంత్ తీవ్ర కడుపు నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. రజనీకాంత్‌ను రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని ఇప్పటికే ఆసుపత్రి ప్రకటించింది.
రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన సతీమణి లత అన్నారు. రజనీకాంత్ వేట్టయాన్, కూలీ సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో వేట్టయాన్ ఈ నెల 10న దసరా కానుకగా విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది.
Wishing my friend, superstar @rajinikanth a speedy and full recovery. I pray for his health and longevity.
— N Chandrababu Naidu (@ncbn) October 1, 2024