Akira Nandan : అకిరానందన్ డివోషనల్ టచ్..
తన తండ్రి పవన్ లాగానే అకిరానందన్‌కు దైవ భక్తి ఎక్కువే

AP Deputy CM Pawan Kalyan Son Akiranandan devotional touch
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య డాన్స్ నేర్చుకోవడంతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ ట్రైనింగ్ తీసుకోవడంతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారం సాగింది.
అయితే.. అతడు సినిమాల్లోకి వస్తాడా రాడా? అన్న విషయం అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే.. అకిరాకు సంబంధించిన ఏ ఫోటో, సమాచారం బయటకు వచ్చిన కూడా అది వైరల్ అవుతోంది.
Chiranjeevi : చిరంజీవి సరదాగా చేసిన కామెంట్స్ పై విమర్శలు.. వారసుడు కావాలని కోరుకోవడంతో..
దక్షిణాది రాష్ట్రాల్లో పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి పవన్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కేరళలోని శ్రీఆగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌తో పాటు ఆయన తనయుడు అకిరా సైతం ఉన్నాడు.
దీంతో వీరిద్దరి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో అకిరా లుక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఫుల్ గడ్డం, జుట్టు బాగా పెంచుకొని, తండ్రి లాగే పంచ, కుర్తా వేసుకొని సరికొత్త లుక్‌లో అకిరా కనిపించాడు.
అకీరాకు దైవ భక్తి ఎక్కువే..
తన తండ్రిలాగానే అకిరాకు దైవ భక్తి ఎక్కువగానే ఉంది. ఇప్పుడే కాదు గతంలో ఆయన పలు దేవాలయాలను సందర్శించారు. గతేడాది డిసెంబర్‌లో పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ)లోనూ అకిరా పర్యటించాడు. తల్లి రేణు దేశాయ్, సోదరి ఆధ్యతో కలిసి విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు.
ఆ సమయంలోనూ అకిరా హిందూ సంప్రదాయ దుస్తులు ధరించారు. కాశీక్షేత్రంలోని ప్రముఖ దేవాలయాతో పాటు గంగమ్మని దర్శించుకున్నారు.
ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఓ సాధారణ భక్తుడిగా కాశీలో పర్యటించారు. ‘కాశీలో ప్రయాణించాలంటే నడుచుకుంటూ వెళ్లాలి. లేదంటే రిక్షాలోనే వెళ్లాలి అంటూ’ రేణుదేశాయ్ కాశీ యాత్రకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
View this post on Instagram
శ్రీవారి సేవలో..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామీ వారిని పలు సందర్భాల్లో అకిరా దర్శించుకున్నారు.