AP Theaters Issue : ఏపీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానుల సమావేశం

ప్రస్తుతం ఏపీలో సినిమా థియేటర్ల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో నేడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు .....

Ap Thetaers

AP Theaters Issue :   ప్రస్తుతం ఏపీలో సినిమా థియేటర్ల పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకపక్క సినిమా టికెట్ రేట్లని గణనీయంగా తగ్గించారు. ఆ టికెట్ రేట్లతో థియేటర్లని నడపలేమని కొన్ని థియేటర్లు మూతపడుతున్నాయి. మరో పక్క థియేటర్ల పై వరుసగా తనిఖీలు చేసి ఏవేవో కారణాలు చెప్పి థియేటర్స్ ని సీజ్ చేస్తున్నారు. దీంతో థియేటర్ యాజమాన్యాలు ముందే భయపడి వారే స్వచ్ఛందంగా క్లోజ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నా పట్టించుకోవట్లేదు.

Bigg Boss Jessie : బిగ్‌బాస్ జెస్సి హీరోగా ‘ఎర్రర్ 500’

ఈ నేపథ్యంలో నేడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు సమన్వయ కమిటీ సమావేశం పేరిట భేటీ కానున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో తమపై పడుతున్న ప్రభావాన్ని వారు చర్చించే అవకాశం ఉంది. త్వరలో పెద్ద సినిమాల విడుదల, మరోవైపు ఏపీలో థియేటర్ల మూసివేత, టికెట్ రేట్లు తగ్గింపు ఇలాంటి అంశాలతో ఈ సమావేశం ఆసక్తికరంగా మారనుంది. ఇప్పుడు ఏపీలో అందరి చూపు ఈ సమావేశంపైనే ఉంది. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.