Obeli N Krishna : తమిళ్ స్టార్ డైరెక్టర్ ఒబెలి ఎన్.కృష్ణకు ఎ.ఆర్.రెహమాన్ అభినందనలు.. త్వరలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో..

ఒబెలి కృష్ణ ఇటీవల తమిళ్ స్టార్ హీరో శింబుతో 'పాతు తల' సినిమాతో సూపర్ హిట్ కొట్టారు.

Obeli N Krishna : తమిళ్ స్టార్ డైరెక్టర్ ఒబెలి ఎన్.కృష్ణకు ఎ.ఆర్.రెహమాన్ అభినందనలు.. త్వరలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో..

AR Rahaman Appriciated Tamil Director Obeli N Krishna for his Pan India Project

Updated On : June 28, 2023 / 1:58 PM IST

Obeli N Krishna :  తమిళ దర్శకుడు ఒబెలి ఎన్.కృష్ణ.. సూర్య, జ్యోతిక, భూమికతో సిల్లుఇండ్రు ఒరు కాదల్ సినిమాతో డైరెక్టర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మంచి విజయం సాధించారు. ఈ సినిమా తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’గా రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఒబెలి కృష్ణ ఇటీవల తమిళ్ స్టార్ హీరో శింబుతో ‘పాతు తల’ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు.

‘పాతు తల’ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఆ సమయంలో డైరెక్టర్ కృష్ణ ట్యాలెంట్‌ని చూసి అభినందించారు. కృష్ణ ట్యాలెంట్‌ని అభినందిస్తూ ఎ.ఆర్.రెహమాన్ ఒక Apple MacBook Proని కృష్ణకు బహుమతిగా ఇచ్చారు. ఆస్కార్ అవార్డు అందుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ని కృష్ణ తన సినిమా ట్యాలెంట్‌తో మెప్పించారు.

కృష్ణ మాస్ సినిమాతో పాటు లవ్ సినిమాలు స్టార్ హీరోలతో తీసి హిట్స్ కొట్టారు. ఇప్పుడు మరో కొత్త జోనర్‌లో భారీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నారు డైరెక్టర్ కృష్ణ. ఈసారి పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత, గ్లోబల్ వన్ స్టూడియోస్‌ అధినేత రమేష్ కృష్ణమూర్తి నిర్మాణంలో డైరెక్టర్ కృష్ణ ఓ స్టార్ హీరోతో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ విషయంలో ఎ.ఆర్.రెహమాన్ డైరెక్టర్ కృష్ణను అభినందించారు.

AR Rahaman Appreciated Tamil Director Obeli N Krishna for his Pan India Project

Spy Movie : నిఖిల్ ‘స్పై’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కి ముందే ప్రాఫిట్స్‌లో..

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్‌ని డైరెక్టర్ కృష్ణ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో డైరెక్టర్‌గా కృష్ణ స్థాయి మరింత పెరగనుంది. ఒకపక్క డైరెక్టర్ గానే కాక నటుడిగా కూడా అప్పుడప్పుడు పలు సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇటీవల తాను తెరకెక్కించిన పాతు తల సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర చేశారు కృష్ణ. ప్రేక్షకులని మెప్పించడానికి త్వరలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో రానున్నారు డైరెక్టర్ కృష్ణ.