AR Rahman: రామ్ చరణ్ ‘పెద్ది’ మరోసారి వాయిదా.. రెహమాన్ మ్యూజికే కారణమట
మరోసారి వాయిదా పడిన రామ్ చరణ్ పెద్ది సినిమా. ఆలస్యానికి రహమాన్(AR Rahman) మ్యూజిక్ కారణమట.
ar rahman is the main reason for peddi postponement
- పెద్ది వాయిదాతో మెగా ఫ్యాన్స్ నిరాశ
- రెహమాన్ ఇంకాస్త టైం కోరడమే కారణమట
- బెస్ట్ క్వాలిటీ కోసం ఈ ఆలస్యం అంటున్న టీం
AR Rahman: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలపై తాజాగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా విషయంలో అన్నీ పక్కాగా ప్లాన్ చేసినప్పటికీ, విడుదల మాత్రం మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 30న రావాల్సిన ఈ సినిమాను జూన్ కి వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.
Papam Pratap: చిక్కుల్లో చిన్న సినిమా.. ‘పాపం ప్రతాప్’ సినిమాకు సెన్సార్ షాక్
అయితే, ఈ వాయిదాకి ప్రధాన కారణం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్(AR Rahman) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అని టాక్ వినిపిస్తోంది. సెకండాఫ్ మ్యూజిక్ వర్క్ కోసం ఆయన మరికొంత సమయం కోరడంతో, చిత్ర యూనిట్ రిలీజ్ ప్లాన్స్‌ను మార్చుకోవాల్సి వచ్చిందట. సాధారణంగా రెహమాన్ తన పనిలో క్వాలిటీ కోసం ఎడిటింగ్ పూర్తిగా పూర్తయిన తర్వాతే సంగీత చర్చలు ప్రారంభిస్తుంటారు. ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు టీమ్ సెకండాఫ్ ఫైనల్ ఎడిటింగ్ పనుల్లో బిజీగా ఉంది. రెహమాన్ స్ట్రాటజీ ప్రకారం ఫుల్ ఎడిట్ వెర్షన్ చేతికి అందితేనే, తన మేజిక్‌తో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లగలరని మేకర్స్ భావిస్తున్నారు.
సినిమా అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే, టీమ్ ఈ అదనపు సమయాన్ని కేటాయిస్తోంది. రెహమాన్ వంటి దిగ్గజం సమయం తీసుకుంటే ఔట్పుట్ అద్భుతంగా ఉంటుందని చిత్ర పరిశ్రమలో నమ్మకం ఉంది. అయితే, రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరోను వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. “రెహమాన్ గారు క్వాలిటీ కోసం టైమ్ తీసుకుంటున్నారు సరే, కానీ మా నిరీక్షణ ఎప్పటికి ముగుస్తుంది?” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఏదేమైనా, జూన్‌లో రాబోతున్న ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.
