Aravind Krishna : అరవింద్ కృష్ణ ‘అండర్ వరల్డ్ బిలియనీర్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్..
ఆలస్యం అమృతం, ఇత్స్ మై లవ్ స్టోరీ, ఇటీవల శుక్ర లాంటి సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా పేరు సంపాదించుకున్న అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సిరీస్ 'అండర్ వరల్డ్ బిలియనీర్స్'....................

Aravind Krishna new web series under world billionaires first look released
Aravind Krishna : ఆలస్యం అమృతం, ఇత్స్ మై లవ్ స్టోరీ, ఇటీవల శుక్ర లాంటి సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సిరీస్ ‘అండర్ వరల్డ్ బిలియనీర్స్’. వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూ పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో ప్రస్తుతం మరొక ఆసక్తికరమైన వెబ్ సిరీస్ చేస్తున్నారు.
గగన్ గోపాల్ ముల్క దర్శకత్వం వహిస్తున్న ఈ సీరీస్ ను LS ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎల్. శ్రీనివాసులు, దీవి వేణుగోపాల్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సిరీస్ యొక్క ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. స్టైలిష్ లుక్ లో అరవింద్ కృష్ణ కనిపిస్తుండగా ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తున్న ఈ లుక్ సిరీస్ పై మంచి అంచనాలు పెంచుతుంది.
ఈ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. రాధిక ప్రీతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సీరీస్ లో మధు సూధన్, జ్యోతి రాయ్, షవర్ అలీ, అలోక్ జైన్, లీనా కపూర్ మరియు రవి మల్లిడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సీరీస్ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సిరీస్ విడుదల తేదీని, స్ట్రీమింగ్ ఓటీటీని ప్రకటించనున్నారు.