Arjun Mahi : హీరోగా ఎంట్రీ.. ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ కి పోటీగా నెగిటివ్ షేడ్స్ లో..
బరాబర్ ప్రేమిస్తా సినిమాలో అర్జున్ మహీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో, హీరోయిన్ అన్నయ్య పాత్రలో కనిపించి మెప్పించాడు. (Arjun Mahi)
Arjun Mahi
Arjun Mahi : ఇష్టంగా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అర్జున్ మహీ. మొదటి సినిమాతోనే మెప్పించిన అర్జున్ తరువాత ఎంజాయ్, నువ్వు నేను ఒరేయ్ ఒసేయ్.. సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు కీలక పాత్రగా మారాడు ఈ హీరో. ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా ఇటీవల ఫిబ్రవరి 6న బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా రిలీజయింది.(Arjun Mahi)
బరాబర్ ప్రేమిస్తా సినిమాలో అర్జున్ మహీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో, హీరోయిన్ అన్నయ్య పాత్రలో కనిపించి మెప్పించాడు. హీరోతో పోటీగా అర్జున్ మహీకి మంచి యాక్షన్ సీక్వెన్స్‌లు పడ్డాయి. ఈ పాత్ర కోసం అర్జున్ మహీ ఏకంగా 15 కేజీల బరువు పెరిగాడు. ఆ క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశాడు. బరాబర్ ప్రేమిస్తా సినిమాతో మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు అర్జున్ మహీ.
Also See : Sai Pallavi : సాయి పల్లవి జపాన్ వెకేషన్.. మంచులో ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలు వైరల్..
ప్రస్తుతం అర్జున్ మహీ ఆల్రెడీ రెండు కొత్త సినిమాలను ఓకే చేసాడు. త్వరలోనే అవి షూటింగ్ మొదలు కానున్నాయి. హీరోగా చేస్తూనే విలన్ గా, కీలక పాత్రల్లో కూడా నటిస్తాను అని ప్రకటించాడు. హీరోగానే కాదు ఇలా అన్ని రకాల పాత్రలు చేస్తాను అంటే కచ్చితంగా అవకాశాలు వస్తాయి సినీ పరిశ్రమలో. అది అర్జున్ మహీ గ్రహించి హీరోగా కంటే నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.
