Artist Tulasi : ఆస్తి మొత్తం పోయింది.. బాగా తిడితే సాయిబాబా నాకు కొడుకుగా పుట్టాడు..

ఎన్నో ఏళ్లుగా చాలా సినిమాల్లో తల్లి, అత్త పాత్రల్లో మెప్పిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ తులసి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తులసి తన లైఫ్ గురించి మాట్లాడుతూ..................

Artist Tulasi : ఆస్తి మొత్తం పోయింది.. బాగా తిడితే సాయిబాబా నాకు కొడుకుగా పుట్టాడు..

Artist Tulasi intresting comments on Saibaba

Updated On : October 18, 2022 / 7:40 AM IST

Artist Tulasi :  ఎన్నో ఏళ్లుగా చాలా సినిమాల్లో తల్లి, అత్త పాత్రల్లో మెప్పిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ తులసి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తులసి తన లైఫ్ గురించి మాట్లాడుతూ.. ”నేను డైరెక్టర్ శివమణిని పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లి సింపుల్ గా గుడిలో జరిగిపోయింది. మాకేమో చాలా ఆస్తి ఉంది. మా భర్త వాళ్ళు పేదవాళ్ళు. నేను వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టాక వాళ్ళకి కలిసి వచ్చింది. ఆ సమయంలో మా ఆయన హీరోగా ఓ సినిమా చేసి డబ్బులు మొత్తం పోగొట్టారు. కొన్ని రోజుల తర్వాత నేను నిర్మాతగా, నటిగా మిణుగుతార అనే ఒక సినిమా చేశాను. సినిమా హిట్టయితే బాబా గుడి లోపల ప్రభావళి చేస్తానని మా ఆయన మొక్కుకున్నాడు.”

Rani Chatterjee : సాజిద్ ఖాన్ పై మరో హీరోయిన్ విమర్శలు.. నాకు ఐటెం సాంగ్ ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి..

”మిణుగుతార సినిమా సూపర్‌ డూపర్‌ హిట్ అయి కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. మాకు లాభం కూడా బాగా వచ్చింది. కానీ మా ఆయన మొక్కు తీర్చడం మర్చిపోయాడు. దీంతో మా ఆస్థి అంతా మళ్ళీ పోయింది. మొదట్లో నేను బాబాని బాగా నమ్మేదాన్ని. నా తమ్ముడు చనిపోయినప్పుడు సాయిబాబాను బాగా తిట్టాను. అప్పుడు ఒక రోజు బాబా నా కలలోకి వచ్చి అమ్మా అని పిలిచి గత ఏడు జన్మలుగా నువ్వే నా తల్లి, ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ నీ కడుపులో పుడతానని చెప్పారు. ఆయన చెప్పినట్టే ఆ కల వచ్చిన ఆరేళ్ళ తర్వాత నాకు కొడుకు పుట్టాడు. అతడికి సాయి అనే పేరు పెట్టుకున్నాను” అని తెలిపింది.