Devaki Nandana Vasudeva : అశోక్ గల్లా ‘దేవకీ నందన వాసుదేవ’ ట్రైలర్ వచ్చేసింది..
సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో నటిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’.

Ashok Galla Devaki Nandana Vasudeva Trailer out now
సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో నటిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మానస వారణాసి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
అందులో భాగంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ భూమి మీద ఎక్కడా లేని విధంగా సుదర్శన చక్రంతో వాసుదేవుడి విగ్రహం ఉంది అని సాయి కుమార్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. మొత్తంగా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
Prateik Babbar : స్టార్ హీరో కొడుకు.. 13 ఏళ్లకే డ్రగ్స్ అలవాటు.. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ యాక్టర్..
ఈ చిత్రానికి హను మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయగా.. సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది.