Vishwak Sen : అశోక వనంలో అర్జున కళ్యాణం ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి??
విశ్వక్సేన్ హిట్ కొట్టాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? అసలు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది?..............
Vishwak Sen : విశ్వక్సేన్, రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించిన అశోక వనంలో అర్జున్ కళ్యాణం సినిమా ఇవాళ (మే 6న) ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాకి విశ్వక్సేన్ ప్రమోషన్స్ భారీగానే చేశాడు. ఒక ఛానల్ లో విశ్వక్సేన్ కి యాంకర్ తో అయిన వివాదం వల్ల ఈ సినిమాకి మరింత హైప్ వచ్చింది. ఇప్పటికే సినిమా చూసిన వారంతా పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. విశ్వక్సేన్ హిట్ కొట్టాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? అసలు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది?
అశోకవనంలో అర్జున్ కళ్యాణం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
నైజాం – 2 కోట్లు
సీడెడ్ – 1 కోటి
ఆంధ్ర – 2.40 కోట్లు
మొత్తం ఏపీ, తెలంగాణలో 5.40 కోట్ల బిజినెస్ చేసింది.
రెస్టాఫ్ భారత్ – 25 లక్షలు
ఓవర్సీస్ – 15 లక్షలు
Rajshekar : శేఖర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు
మొత్తంగా ఈ సినిమా 5.80 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 6 కోట్లు అయినా రాబట్టాలి. ఈ సినిమాకి పోటీగా సుమ నటించిన జయమ్మ పంచాయితీ, శ్రీ విష్ణు నటించిన భళా తందనాన సినిమాలు ఉన్నాయి. మరి విశ్వక్సేన్ ఏ మేరకు ప్రేక్షకులని థియేటర్ కి రాబట్టగలడో చూడాలి.