Ashu Reddy : ఎట్టకేలకు తన బ్రెయిన్ సర్జరీని బయటపెట్టిన అషురెడ్డి.. వీడియో వైరల్..
తాజాగా అషురెడ్డి తన బ్రెయిన్ సర్జరీ జరిగినప్పటి ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Ashu Reddy Shares About her Brain Tumor Surgery Video goes Viral
Ashu Reddy : టిక్ టాక్ వీడియోలు, రీల్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం అషురెడ్డి పలు టీవీ షోలు, సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అషురెడ్డి తనకు 2024లో బ్రెయిన్ సర్జరీ అయిందని తెలిపింది. అది జరిగిన చాన్నాళ్లకు ఈ విషయం బయటపెట్టింది.
తాజాగా అషురెడ్డి తన బ్రెయిన్ సర్జరీ జరిగినప్పటి ఫోటోలు, వీడియోలు కలిపి ఓ వీడియోగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో అషురెడ్డి ఫోటోలను చూసి పాపం అషు ఎంత కష్టపడిందో అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.
Also Read : Anchor Rashmi : టీవీ షోలో చిన్ననాటి ఫ్రెండ్స్ తో యాంకర్ రష్మీ.. బర్త్ డే స్పెషల్.. ఫోటోలు చూశారా?
గతంలో అషురెడ్డి ఈ బ్రెయిన్ సర్జరీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2024లో ఓ సారి బాగా తలనొప్పి వచ్చింది. అయిదు రోజులు డోలో ట్యాబ్లేట్ తో మెయింటైన్ చేశాను. ఒకరోజు తల బాగా బరువుగా అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్టులు చేయిస్తే బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు. అపోలో హాస్పిటల్ లో ఓవర్ నైట్ ఆపరేషన్ కి రెడీ చేసారు. సగం పైగా హెయిర్ తీసేసారు. ఆ ట్యూమర్ తీసేటప్పుడు నరాలు ఏవన్నా డిస్టర్బ్ అవుతాయి ఆపరేషన్ తర్వాత ఏదైనా జరగొచ్చు అని చెప్పారు. హాస్పిటల్ లో 10 రోజులు ఉన్నాను. ఆపరేషన్ అయ్యాక అంతా బాగానే ఉంది. కాకపోతే గట్టిగా మాట్లాడలేను. పెయిన్ వచ్చేస్తుంది. ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలి అన్నారు. ఆరు నెలలు ఖాళీగా కూర్చొని ఏం చేయాలి అని హెయిర్ లేకపోయినా రెండు నెలల్లో షూట్ కి వెళ్ళాను. హెయిర్ స్టయిలిష్ట్స్ విగ్స్ తో సెట్ చేయడంతో షూట్ చేశారు. మళ్ళీ వర్క్ లో బిజీ అవ్వడం వల్లే బాగా రికవర్ అయ్యాను అని తెలిపింది.
ఇప్పుడు తన బ్రెయిన్ సర్జరీకి సంబంధించిన వీడియో షేర్ చేసి.. ఇదే లైఫ్ అంటే అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా అషురెడ్డి షేర్ చేసిన వీడియో చూసేయండి..
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఏ పాటలు వింటాడో తెలుసా? ఆనంద్ సాయి చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోతారు..