Anushka Shetty : అనుష్క పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జ్యోతిష్యుడు!
అనుష్క వివాహంపై ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ జగన్నాథ్ గురూజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలో అనుష్కకు వివాహం జరుగుతుందని వివరించారు.

Anushka Shetty Marriage
Anushka Shetty : తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ అనుష్క పెళ్లిపై వచ్చినన్ని రూమర్స్ మరే ఇతర నటీమణులపై వచ్చిండవేమో.. ప్రభాస్ – అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఈ విషయంపై గతంలో అనుష్క స్పందించారు. తాను, ప్రభాస్ మంచి స్నేహితులమని క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్ కి తెరపడింది. ఆ తర్వాత అనుష్క పెళ్లి విషయంలో అనేక రూమర్స్ వచ్చాయి. ఓ వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి కుదిరిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. చివరకు అది కూడా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.
Read More : Ghost Movie : కింగ్ పక్కన కాజల్ బదులు జాక్వెలిన్..
అయితే తాజాగా ప్రముఖ జ్యోతిషుడు జగన్నాథ్ గురూజీ అనుష్క పెళ్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అనుష్క వృత్తి విషయంలో ఎంతో సిన్సియర్ అని, ఆమె ముఖ కవళికలను బట్టి చూస్తే ఇండస్ట్రీ వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తిని అనుష్క పెళ్లాడనుందని పేర్కొన్నారు. 2023లోపు అనుష్కకు వివాహం జరుగుతుందని వివరించారు. అయితే ఇది ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలి అంటే ఎదురుచూడాల్సిందే.
Read More : Elon Musk Grimes : ప్రియురాలితో విడిపోయిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్
ఇక మరోవైపు అనుష్క సినిమాలకు కొంచం గ్యాప్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. నిశ్శబ్దం సినిమా అనంతరం జోరు తగ్గించిన అనుష్క నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తుందని అనౌన్స్ చేసినా ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని టాక్ వినిపిస్తుంది.