Asuran actor: అసురన్ నటుడు కన్నుమూత

Asuran Actor
కరోనా సెకండ్ వేవ్ బాగా కష్టబెట్టేస్తోంది. ఎంతోమంది చనిపోవడానికి కారణం అవుతుంది. ఫస్ట్ వేవ్‌లో మరణాలు కంటే సెకండ్ వేవ్‌లో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా అసురన్ సినిమాలో నటించిన నటుడు కూడా లేటెస్ట్‌గా చనిపోయారు. అసురన్ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించిన తమిళ నటుడు నితీశ్ వీరా(45) కన్నుమూశాడు.
కరోనా కారణంగా నితీశ్ వీరా చనిపోగా.. తమిళ చిత్రపరిశ్రమ శోకంలో మునిగిపోయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది నటీనటులు కరోనాతో చనిపోగా.. అసురన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నితీశ్ చనిపోవడం చిత్రపరిశ్రమకు లోటు అంటున్నారు తమిళ నటులు.
‘పేరరుసు’, ‘వెన్నిల కబడి కుళు’, ‘పుదు పేట్టై’ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన వీరా.. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతి, శృతీ హాసన్ జంటగా నటిస్తున్న ‘లాభం’ సినిమాలో ‘కీ’ రోల్‌లో నటిస్తున్నాడు. మరోవైపు ‘నీరో’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు.