Atharva: కొత్త హీరోయిన్ ఐరా.. అధర్వ నుంచి ఫస్ట్ లుక్..

యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా "అధర్వ". ముందు నుంచీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా..

Atharva: కొత్త హీరోయిన్ ఐరా.. అధర్వ నుంచి ఫస్ట్ లుక్..

Atharva Movie Heroine First Look Poster Released

Updated On : October 12, 2022 / 3:05 PM IST

Atharva: యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా “అధర్వ”. ముందు నుంచీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు.

Squid Game: “స్క్విడ్ గేమ్ 2” ఒక్కొక ఎపిసోడ్‌కి ఆ నటుడు అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?

‘ది సీకర్ ఆఫ్ ది ట్రూత్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. దీంతో అదే జోష్‌లో తాజాగా ఐరా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ కన్ఫమ్ చేయగా.. ఇప్పుడు ఐరా లుక్‌తో గ్లామర్ టచ్ కూడా ఉంటుందని, ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేస్తూ ఈ సినిమా రూపొందించారని స్పష్టం చేస్తోంది.

‘నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్..’ అంటూ మోషన్ పోస్టర్‌లోని డైలాగ్ అందరిలోనూ ఈ అధర్వ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇందులో హీరో కార్తీక్ రాజు పవర్‌ఫుల్ రోల్‌ పోషించినట్టు గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ ను బట్టి అర్థమైంది. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ చెప్పేశాయి.

డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. ఆయన మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్ అంటున్నారు మేకర్స్. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మారిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

Atharva Movie Heroine First Look Poster Released

Atharva Movie Heroine First Look Poster Released