Barabar Premistha : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సెకండ్ సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’ టీజర్ వచ్చేసింది..

తాజాగా నేడు బరాబర్ ప్రేమిస్తా సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

Barabar Premistha : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సెకండ్ సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’ టీజర్ వచ్చేసింది..

Attitude Sta Chandra Hass Second Movie Barabar Premistha Teaser Released

Updated On : December 19, 2024 / 4:31 PM IST

Barabar Premistha : సీనియర్ నటుడు ఈటీవీ ప్రభాకర్ తనయుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఇటీవల రామ్ నగర్ బన్నీ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా చంద్రహాస్ మాత్రం బాగా వైరల్ అయ్యాడు. ఇప్పుడు చంద్రహాస్ రెండో సినిమాతో రాబోతున్నాడు. చంద్రహాస్, మేఘన ముఖర్జీ జంటగా సంపత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. గెడ చందు, గాయత్రీ చిన్ని, AVR నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Also Read : Mahesh – Mufasa : రేపే ‘ముఫాసా’ రిలీజ్.. మహేష్ పోస్ట్.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా .. వాయిస్ కే ఈ రేంజ్ రచ్చ..

తాజాగా నేడు బరాబర్ ప్రేమిస్తా సినిమా టీజర్ రిలీజ్ చేసారు. సీనియర్ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా ఈ టీజర్ ని రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ టీజర్ చూసేయండి..

ఈ టీజర్ చూస్తుంటే రుద్రారం అనే ఓ ఊళ్ళో జరిగే కథ అని, ఆ ఊళ్ళో అందరూ ప్రతిదానికి కొట్టుకుంటారని ఆ మధ్యలో హీరో – హీరోయిన్ లవ్ స్టోరీ గా ఉండబోతుంది. ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. టీజర్ రిలీజ్ ఈవెంట్లో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ.. రామ్ నగర్ బన్నీ సినిమాకు ఆడియెన్స్ లో మంచి రీచ్ వచ్చింది. ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా సినిమాతో రాబోతున్నాను. మా డీవోపీ శేఖర్ నా బ్లాక్ డాగ్ వైట్ చిక్ సినిమా టీజర్ చూసి ఈ టీమ్ కు పరిచయం చేయడంతో ఈ సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కి ధన్యవాదాలు. ఈ సినిమాకు ద్రువన్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోతుంది. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరొస్తుందని అని తెలిపాడు.

Attitude Sta Chandra Hass Second Movie Barabar Premistha Teaser Released

యాక్టర్ అర్జున్ మహి మాట్లాడుతూ.. 2018లో ఇష్టంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. డైరెక్టర్ సంపత్ ఆ సినిమా తీశారు. ఇప్పుడు అదే దర్శకనిర్మాతలతో తీస్తున్న ఈ సినిమాలో నటించాను. చిన్న చిత్రంగా మొదలైన ఈ సినిమా పెద్ద సినిమాగా మారింది. దాదాపు 200 మంది జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్ లో ఉండేవాళ్ళు అని తెలిపారు.

దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ.. నేను గతంలో ఇష్టంగా, ఏక్ అనే సినిమాలు చేశాను. ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరి చేయాలనుకొని బరాబర్ ప్రేమిస్తా తీసాను. చంద్రహాస్ హీరోగా ఈ సినిమా మొదలుపెట్టాం. మా సినిమా అముందే చంద్రహాస్ ఆటిట్యూడ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది అని తెలిపారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్, హీరోయిన్ మేఘనా ముఖర్జీ మాట్లాడుతూ.. బరాబర్ ప్రేమిస్తా సినిమాతో హీరోయిన్ గా మీకు పరిచయం అవుతున్నాను. మా టీమ్ అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. నాకు ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని తెలిపింది.

Attitude Star Chandra Hass Second Movie Barabar Premistha Teaser Released

నిర్మాత చిన్ని గాయత్రి మాట్లాడుతూ.. బరాబర్ ప్రేమిస్తా సినిమా టీజర్ లాంఛ్ చేసిన డైనమిక్ డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్. నేను కూడా పరుచూరి మురళి, జయంత్ సి పరాన్జే గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను. ఈ సినిమా కథ వినగానే నచ్చి నా ఫ్రెండ్స్ తో కలిసి నిర్మిస్తున్నాను. డేస్ పెరిగినా, బడ్జెట్ పెరిగినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో సినిమా చేశాం అని తెలిపారు.