August Movie Releases : ఆగష్టులో థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న సినిమాలివే.. మీరు ఏ మూవీకి..?
ఆగష్టులో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర కనిపించబోతుంది. రోజులు, వారం గ్యాప్ లో చిన్న పెద్ద సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.
August Movie Releases : జులైలో థియేటర్స్ వద్ద సినిమాల సందడి పెద్దగా కనిపించక మూవీ లవర్స్ కొంత నిరాశ చెందారు. అయితే ఈ ఆగష్టులో మాత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర కనిపించబోతుంది. రోజులు, వారం గ్యాప్ లో చిన్న పెద్ద సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఆగష్టు 10 నుంచి ఈ జాతర మొదలు కాబోతుంది.
మొదటిగా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ (Jailer) సినిమాతో బాక్స్ ఆఫీస్ ని కస్టడీలోకి తీసుకోబోతున్నాడు. ఆగష్టు 10న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, నాగబాబు, సునీల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా.. ఇలా స్టార్ క్యాస్ట్ నటించారు. మరి రోబో తరువాత నుంచి హిట్టు లేని రజినీకి ఈ మూవీ సక్సెస్ ఇస్తుందా లేదా చూడాలి.
Madhilo Madhi : బేబి దర్శకుడు సాయి రాజేష్.. ‘మదిలో మది’ మూవీ ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్..
రజినీ వెనకాలే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఆగష్టు 11న భోళా శంకర్ (Bholaa Shankar) తో సందడి చేయనున్నాడు. తమిళ్ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ ఇద్దరి స్టార్ హీరోల సినిమాల మధ్య టాలీవుడ్ యంగ్ హీరో శ్రీసింహ.. తన ఉస్తాద్ (Ustaad) మూవీని ఆగష్టు 12న తీసుకురాబోతున్నాడు. రజినీ అండ్ చిరుతో పోటీ పడి సక్సెస్ అందుకుంటాడా? లేదా ఫెయిల్ అవుతాడా చూడాలి.
Pawan Kalyan : ఎన్నికల్లో నెగ్గిన దిల్ రాజుకి జనసేన పవన్ కళ్యాణ్ అభినందనలు..
ఈ సినిమాల తరువాత వారం గ్యాప్ తో 18వ తేదీ ఒకే రోజున మూడు సినిమాలు థియేటర్ లోకి రాబోతున్నాయి. ఒకటి అనుష్క అండ్ నవీన్ నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty). అలాగే మెగా హీరో వైష్ణవ తేజ్ నటిస్తున్న ఆదికేశవ (Adikeshava). శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మూడో సినిమా పెద్దకపు 1. కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా వస్తుంది.
ఇక ఈ నెల చివరి వారంలో ముందుగా మలయాళ పాన్ ఇండియా మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ అఫ్ కోత (King Of Kotha) ఆగష్టు 24న రిలీజ్ కాబోతుంది. ఆ నెక్స్ట్ డే 25న వరుణ్ తేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna), కార్తికేయ బెదురులంక 2012 (Bedurulanka 2012) విడుదల కానున్నాయి. మరి ఈ చిత్రాల్లో ఏ సినిమాకి వెళ్ళాలి అనుకుంటారో చూసి టికెట్స్ బుక్ చేసేసుకోండి.