Guard Movie : ఆస్ట్రేలియాలో తీసిన హారర్ సినిమా.. ఓటీటీలోకి..
ఈ సినిమా మొత్తం ఆస్ట్రేలియాలోనే తెరకెక్కించారు.

Guard Movie
Guard Movie : విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియానార్డ్ జంటగా తెరకెక్కిన సినిమా ‘గార్డ్’. రివెంజ్ ఫర్ లవ్ ట్యాగ్‌లైన్. అను ప్రొడక్షన్స్ బ్యానర్ పై అనసూయ రెడ్డి నిర్మాణంలో జగ పెద్ది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 28న థియేటర్స్ లో విడుదల అయింది. ఈ సినిమా మొత్తం ఆస్ట్రేలియాలోనే తెరకెక్కించారు.
గార్డ్ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ లో గార్డ్ సినిమా మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటుంది.
Also Read : Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ సండే స్పెషల్ ఫొటోలు.. మోడ్రన్ డ్రెస్ లో అట్రాక్టివ్ లుక్స్..
గార్డ్ కథ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన సుశాంత్(విరాజ్ రెడ్డి) సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ డాక్టర్ సామ్(మిమీ లియానార్డ్)తో ప్రేమలో పడతాడు. సుశాంత్ పనిచేసే హాస్పిటల్ బేస్మెంట్ లో ఎప్పుడూ ఏదో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. తనని కూడా అక్కడకు తీసుకెళ్లమని సామ్ అడగడంతో తీసుకెళ్తాడు. అనుకోకుండా సామ్ అక్కడ ఎవ్వరూ ఓపెన్ చేయని ఓ రూమ్ కి వెళ్లడంతో ఆమెలోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. దీంతో ఆ ఆత్మ సామ్ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ సుశాంత్ ని, అతని ఫ్రెండ్ ని భయపెడుతుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది? ఆ ఆత్మ కథ ఏంటి? సుశాంత్ కి ఆ ఆత్మకు సంబంధం ఏంటి? ఇతను చేసే సెక్యూరిటీ గార్డ్ పనితో అతను ఏం చేసాడు తెలియాలంటే అమెజాన్ ఓటీటీలో చూసేయాల్సిందే.
Also Read : Tollywood : వాళ్ళను షూటింగ్ లకు వెళ్ళొద్దని లెటర్ రిలీజ్.. మళ్ళీ టాలీవుడ్ లో సమ్మె..